
చంద్రగిరి నియోజకవర్గంలో త్రాగు నీటికి ఇబ్బందులు లేకుండా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంది.
సాక్షి, చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలో త్రాగు నీటికి ఇబ్బందులు లేకుండా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంది. రాజ్యసభ సభ్యుడు వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి 7 ట్యాంకర్లు కొనుగోలు చేశారు. రూ. 52 లక్షలతో 7 ట్యాంకర్లను కొనుగోలు చేసి నీటి సరఫరా కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. చంద్రగిరి వాసులకు 7వాటర్ ట్యాంకర్లు ఇస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు.
వేమి రెడ్డికి చంద్రగిరి వాసులు రుణపడి ఉంటారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డీ భాస్కర్ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా ఎక్కడ నీటి సమస్య ఉంటే అక్కడ ఈ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.