సాక్షి, తిరుపతి : చంద్రగిరిలో జరుగుతున్న వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్ చాలా గొప్ప కార్యక్రమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం క్రీడలను పూర్తిగా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం రాలేదని, కానీ నారా లోకేష్‌కు మాత్రం మంత్రి పదవి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానిని ప్రత్యేక హోదా సంజీవని అని పునరుద్ఘాటించారు. హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశం లభిస్తాయని స్పష్టం చేశారు.
చంద్రబాబు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయ్యారని వైవీ దయ్యబట్టారు. కమీషన్ల కోసమే పోలవరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని.. ఇందులో భాగంగానే చంద్రబాబుకు ముడువులు ముట్టాయని ఆయన ఆరోపించారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కొసం పోరాడుతున్న పార్టీ, వైఎస్సార్‌సీపీ అని స్పష్టం చేశారు. టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే తెలుగుదేశం ఎంపీలు తమతో పాటు కలిసిరావాలంటూ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందన్నారు.
రాయలసీమపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైవీ మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ప్రారంభం కావాల్సిందని, కానీ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ప్లాంట్ ఏర్పాటులో పురోగతి లేదని మండిపడ్డారు. ఏ ఒక్కరోజైనా ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడారా అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ సభ్యులు రాజీనామా చేసిన ఎంపీ స్థానాలకు తప్పనిసరిగా ఎన్నికలు వస్తాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment