
సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషస్‌ల దగ్గర ప్రత్యేక రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశంలో అయన పాల్గొని.. దీని పరిధిలో రెండు నర్సరీలు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు ప్రతి ఇంటికి నాలుగు మొక్కల చొప్పున.. కొబ్బరి, జామ, పూల చెట్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. శ్రీసిటీని తుడా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వ ఆమోదానికి తీర్మానం చేశామని తెలిపారు.
తుడాకు చెల్లించాల్సిన రూ.35 కోట్ల బకాయిలు టీటీడీ చెల్లించాలి ఆదేశించారు. కాగా తుడాకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసి.. రిటైర్డ్ ఉద్యోగుల నియమాకం చేపడతామన్నారు. దీని పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్‌లపై విచారణకు ఆదేశాలు జారీ చేసి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment