ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోసం పోలీసు వ్యవస్థ దిగజారి వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సర్వే చేస్తున్న వారిని వదిలిపెట్టి, వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన తమ నేతలపై కేసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఒక శాసన సభ్యుడు అని చూడకుండా అతన్ని ఇబ్బంది పెట్టారన్నారు.