అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సదుపాయాలు, నిర్వహణ తీరును వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి మాట్లాడుతూ.. సభలో మంచి నీళ్లు కావాలని నాలుగుసార్లు అడిగినా పట్టించుకునేవారు లేరని చెప్పారు. చివరకు బయట నుంచి నీళ్లు తీసుకుని వెళ్తామన్నా సభలోకి బాటిళ్లు అనుమతించడం లేదని, లోపలా ఇవ్వడం లేదని అన్నారు. ఇక బాత్ రూములలో నీళ్లు రావడం లేదని, ఏపీ అసెంబ్లీ నిర్వహణ ఇంత ఘనంగా ఉందని ఎద్దేవా చేశారు.
మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందన్నారు.