హైదరాబాద్ : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో చంద్రబాబు సర్కార్ తప్పుడు విధానాలు అవలంభిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రభుత్వ కమిటీలలో అనధికార వ్యక్తులకు, టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించడం సరికాదని వారు అన్నారు. సామాజిక కార్యకర్తల ముసుగులో రౌడీషీటర్లకు స్థానం కల్పిస్తూ స్థానిక సంస్థల స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.
ప్రభుత్వ కమిటీలో స్థానిక సంస్థల ప్రతినిధులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అన్ని పథకాల్లో చంద్రబాబు తమ ఏజెంట్లను నియమించుకుని ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
'చంద్రబాబు తమ ఏజెంట్లను నియమించుకున్నారు'
Published Tue, Dec 23 2014 11:18 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement