'బాబుది మాఫియా సర్కార్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రభుత్వం మాఫియా ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఇది భూదందా ప్రభుత్వం అని చెప్పారు. ఇసుక మాఫియా, కల్తీ మద్యం మాఫియా, భూదందా మాఫియా, రాజధాని నిర్మాణంలో మాఫియా విధానాలు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు.
పరిపాలన పేరుతో నిలువెత్తు వ్యాపారాన్ని చంద్రబాబు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటివి చూడలేక ప్రజల పక్షాన తాము అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో ఏపీ ప్రభుత్వ మోసాలను ఎండగడతామని చెప్పారు. రాజధాని పేరిట వేల కోట్ల రూపాయలు సంపాధించి పది నుంచి 30 కోట్లతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోనేందుకు ప్రలోభపెడుతున్నారని చెప్పారు. విప్ దిక్కరించే ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, ఎవరు ఎవరి పక్షాన ఉంటారో తేలిపోతుందని కూడా ఆయన చెప్పారు.