కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్‌ | Actor Sai Kumar, Director Anil Ravipudi Visits Tirumala Tirupati Devasthanam | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు

Published Sat, Jan 1 2022 10:43 AM | Last Updated on Sat, Jan 1 2022 11:04 AM

Actor Sai Kumar, Director Anil Ravipudi Visits Tirumala Tirupati Devasthanam - Sakshi

నటుడు సాయికుమార్, అలాగే డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడిలు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు.  అనంతరం ఆలయ అర్చకులు వారిని స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. తాను సినీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవుతుందన్నారు.

ఇక రెండేళ్లు క్లిష్ట పరిస్థితులను చుశామని, ఒమిక్రాన్‌ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుదేవా, ధనుష్‌, నానిలతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే కన్‌ఫ్యూజన్‌లో నిర్మాతలు ఉన్నారని పేర్కొన్నారు. ఐక్యంగా అందరూ ముందుకు సాగాల్సిన అవసంర ఉందని, ప్రభుత్వం నియమించిన కమిటీతో సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం ఉందని సాయి కుమార్‌ వ్యాఖ్యానించారు.

కాగా వీరితో పాటు వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సైతం నేడు(జవనరి 1) కొత్త సంవత్సరం సందర్భంగా  శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీవై సీఎం నారాయణ స్వామి, జమ్మూకశ్మీర్‌ లేఫ్టనెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, టీఎన్‌ మంత్రి గాంధీ భట్, గుజరాత్‌ మినిస్టర్‌ జితేందర్‌ చౌదరి భట్టి విక్రమార్క, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిలు శ్రీవారిని దర్శించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement