‘టీడీపీలో అవినీతి రాజ్యమేలుతోంది’
సదుం: టీడీపీ ప్రభుత్వ పాలనలో కిందిస్థాయి నుంచి పై వరకు అవినీతి రాజ్యమేలుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని ఎర్రాతివారిపల్లెలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో ముందుందన్నారు. వైద్యశాలలో ఎలుకలు కపట్టేందుకు రూ.60 లక్షలు వెచ్చించడం సిగ్గుచేటన్నారు. ఆరు మంది భోజనాలకు రూ. 11 లక్షలు ఖర్చు చేయడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
స్వంత గృహం ఉన్నా ఫైవ్‌స్టార్ హోటల్‌లో నెలకు కోటి రూపాయలు చెల్లించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు పాల సాగిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ఆరాచక పాలనపై వైఎస్‌ఆర్‌సీపీ ఫ్లీనరీలో చర్చిస్తామని ఎంపీ చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, రాష్ట్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్లీనరీలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చర్చించనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి నాయకులతో మాట్లాడి సమస్యల పరిష్రారానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారిస్తామన్నారు.