టీడీపీ అరాచకాలను దీటుగా ఎదుర్కొంటాం | TDP as the encounter against the inhumanity | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకాలను దీటుగా ఎదుర్కొంటాం

Published Mon, Jul 11 2016 2:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

TDP as the encounter against the inhumanity

ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ ప్రజాస్వామ్య విరుద్ధం
కార్యకర్తల వునోభావాలను దెబ్బతీయులేరు
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

 
సరివుడుగు(గుర్రంకొండ): టీడీపీ అరాచకాలను దీటుగా ఎదుర్కొంటామని, కుట్రలెన్ని చేసినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల వునో భావాలను దెబ్బతీయలేరని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం గుర్రంకొండ మండలంలోని సరివుడుగులో ఏర్పాటుచేసిన సవూవేశంలో వారు మాట్లాడారు. 70 ఇళ్ల కాలనీలో కేవలం  ఒక్క వైఎస్సార్‌సీపీ నేత ఇంటి నే కూల్చడం దారుణమని, దీనిపై ప్రశ్నించిన చంద్రగిరి ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. బెయిల్‌పై విడుదలై తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఆర్డీవో కార్యాలయుం ఎదుట శాంతియుుతంగా ధర్నా చేస్తే తప్పుడు కేసులతో మరోసారి అరెస్ట్ చేయుడం టీడీపీ దౌర్జన్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. 


పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ని కులంపేరుతో దూషించి దౌర్జన్యానికి దిగినప్పుడు ఇదే పోలీసులు ఎక్కడున్నారని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రవు కేసులు బనారుుంచి టీడీపీవైపు తిప్పుకోవాలని ప్రయుత్నిస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయుపడేది లేదన్నారు.  వురికొంతవుంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ గ్లోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని వివుర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు వూనుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.  సమావేశంలో రాష్ట్ర మైనార్టీసెల్ కార్యదర్శి జమీర్ అలీఖాన్, ఎంపీపీలు నక్కాచంద్రశేఖర్, వుహితాఆనంద్, అరుణమ్మ, వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు రెడ్డిభాషా, జయురావుచంద్రయ్య, శ్రీవళ్లి, తదితర పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement