![Make social media as weapon says Mithun Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/28/mithun.jpg.webp?itok=N3Kgzz6m)
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలనను, వైఫల్యాలను ఎండగట్టాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన ‘వైఎస్సార్ కుటుంబం’ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమని, ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని కోరారు. వైఎస్ జగన్ ప్రకటించిన ‘నవరత్నాల’ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, నేతలు ఎంవిఎస్ నాగిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రాజారాం, పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment