లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్): విభజన హామీల అమలుకు చేతనైతే కేంద్రంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. అందుకు ప్రభుత్వం ముందుకు వస్తే పోరాటానికి తాము కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లెలో మీడియా సమావేశంలో ఆయన ఇవాళ మాట్లాడారు.
కేంద్రానికి లొంగిపోయిన బాబు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజియే ముద్దు అని ఓటుకు నోటు కేసులో కేంద్రానికి చంద్రబాబు లొంగిపోయారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ఉన్న మంత్రులతో రాజీనామా చేయించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులతో అవినీతి వల్ల కేంద్రం నిధులు నిలుపుదల చేస్తే అది ప్రతిపక్షం వల్లే అని దుష్ర్ఫాచారం చేయడం తెలుగుదేశం నీచ రాజకీయాలకు నిదర్శమన్నారు. ఉపాధి హామీ నిధులకు సంబంధించి లేబర్ కంపొనెంట్ నిధులు విడులతకు పార్లమెంట్, అసెంబ్లీలో ప్రశ్నించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని మిథున్ రెడ్డి గుర్తు చేశారు.
రాష్ట్రాభివృద్ధిపై ధ్యాస పెట్టండి: ఎన్డీఏ మిత్ర పక్షంగా అధికార భాగస్వామ్యంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేక పోవడం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనే ధ్యాస రాష్ట్రాభివృద్ధిపై పెడితే ప్రజలు హర్షిస్తారని ఎంపీ సూచించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోమన్‌రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని చెప్పారు. ప్రతిపక్షంపై నీచ రాజకీయాలు మాని, విభజన హామీల అమలుకు కేంద్రంపై పోరాటినికి తెలుగుదేశ ప్రభుత్వం సిద్ధపడాలని ఎంపీ మిథన్ రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment