
ప్రత్యేక హోదా సాధనలో రాష్ర్ట ప్రభుత్వం విఫలం
ప్రత్యేక హోదా సాధనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రె డ్డి అన్నారు
♦ జగన్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతాం
♦ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
పీలేరు : ప్రత్యేక హోదా సాధనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రె డ్డి అన్నారు. శనివారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడవల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పార్లమెంట్‌లో నిరసన తెలపడంలో తప్పులేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర నిరసన తెలుపడంవల్లే కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదాపై చర్చిస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు.
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, రాష్ర్ట ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫల మైందన్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.