ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయండి | Union Tourism Minister RAJAMPET MP mithunreddy request | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయండి

Published Wed, May 11 2016 2:59 AM | Last Updated on Thu, Aug 9 2018 4:43 PM

ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయండి - Sakshi

ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయండి

కేంద్ర పర్యాటక మంత్రికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి వినతి
 
యూనివర్సిటీ క్యాంపస్: రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని అభివృద్ధి చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కోదండరామాలయం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయమని, సంవత్సరం పొడవునా లక్షలాదిమంది భక్తులు వస్తుంటారని తెలిపారు.

ఇది చారిత్రకమైన హిందూ ఆలయమే కాకుండా పురాతన సాంస్కృతిక క్షేత్రమని తెలిపారు. అయితే ఈ క్షేత్రానికి వస్తున్న భక్తులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ముఖ్యంగా బస చేసేందుకు సరైన సౌకర్యాలు లేవన్నారు. ఈ ఆలయానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పురాతన సాంస్కృతిక క్షేత్రంగా గుర్తించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement