
బాబూ ఆ డబ్బు ఎక్కడిదో చెబుతారా?
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడి ్డ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడనేది సమాధానం చెప్పాలని రాజంపేట ఎంపీ
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి
నందలూరు : ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడి ్డ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడనేది సమాధానం చెప్పాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సీఎం చంద్రబాబును నిలదీశారు. ఎన్నికల నాటి హామీలను ఒకటి కూడా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. నందలూరుకు వచ్చిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. నంద లూరులో రైల్వే ట్రాక్షన్ లోకో షెడ్ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.
బాబును ఏ-1గా చేర్చాలి
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబునాయుడును ఏ-1గా చేర్చి, అరెస్ట్ చేయాలని కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, చంద్రబాబు అవినీతి సామ్రాట్‌గా ఎదుగుతున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి, నిర్థోషిగా నిరూపించుకోవాలని సవాల్ చేశారు. ఈ వ్యవహరాల్లో తమ పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఏమాత్రం సంబంధం లేకున్నా, అకారణంగా నిందించడం సబబు కాదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ైవె స్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్తకార్యదర్శి చొప్పా యల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి
రె వెన్యూ అధికారుల నిర్లక్షానికి బలవన్మరణానికి గురైన రైతు సయ్యద్ మగ్బుల్ కుటుంబానికి ప్రభుత్వంరూ. ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మృతుని కుటుంబాన్ని ఆయన పరామర్శింరు. మృతుని కుమారునికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అదనంగా భూమి ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. మృతుడి కుటుంబీకులపై కేసు నమోదు చేయడం సమంజసం కాదని, దీనిపై ఎస్‌పీతో మాట్లాడతానని తెలిపారు. ఆయన వెంట కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి కూడా పరామర్శించారు.
క్రీడల్లోనూ రాణించాలి
స్థానిక జెడ్పీ హైస్కూల్ క్రీడామైదానంలో బుధవారం నిర్వహించిన ఎన్‌సీసీ క్రికెట్ టోర్నీ ట్రోఫినీ ఎంపీ ఆవిష్కరించి మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి కడపలో క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, క్రీడా పాఠశాలలను ఏర్పాటుచేసి క్రీడలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఐకేపీఎస్ నాయకుడు పోతురాజు మస్తానయ్య కోరిన విధంగా నందలూరు క్రీడామైదానం అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలకు నందలూరు నిలయమని కొనియాడారు. గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను ఎయిర్‌పోర్ట్ నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు ఎంపీ మిథున్‌రెడ్డి తన సొంత నిధులతో వాహనాన్ని ఏర్పాటుచేశారని తెలిపారు. జెడ్పీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నందలూరు క్రీడామైదానానికి అవసరమైన నిధుల కోసం కృష చేస్తానన్నారు.