
సాక్షి, కడప : బైరటీస్ గనుల్లో ఏపీఎండీసీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారుల అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. కులం పార్టీ అడగనిదే ఏపని చేయడం లేదని విమర్శించారు. చివరకు టాక్సీ డ్రైవర్‌ను కూడా సొంత ఊరి నుంచి తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. అధికారులు బాధ్యతలను వదిలేసి పచ్చ చొక్కాలు వేసుకొని టీడీపీలోకి వెళ్లాలంటూ చురకలంటించారు.
రెండు కంపెనీలకు మేలు జరిగేలా టెండర్ల నిబంధనలు మార్చిన ఘనత చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. అవినీతి అధికారులపై విజిలెన్స్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామకమిటీలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేయాలన్నారు. ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్ కుటుంబం గురించి నీచంగా మాట్లాతున్నారని, మంత్రికి ప్రజలే సరైన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. బాబు అవినీతిపై ప్రశ్నిస్తే.. రమణ దీక్షితులు నుంచి ప్రతిఒక్కరిపైనా కేసులు పెడుతున్నారంటూ మండిప్డడారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పసువులను కొన్నట్లు కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment