2018 లోనే అసెంబ్లీ ఎన్నికలు
అదే సీఎం చంద్రబాబు సభలో జేసీ సోదరులు వైఎస్ జగన్ మోహ న్‌రెడ్డి కుటుంబసభ్యులను విమర్శిస్తే నవ్వుతూ ఉండిపోయారని, ఇది సీఎంకు న్యాయమా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ లోపల, బయట ప్రజల పక్షాన సమస్యలను ప్రస్తావిస్తే సరైన సమాధానం ఇవ్వని సీఎం, మంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను పదేపదే ప్రస్తావిస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. నంద్యాలలో 600 మందికి ట్రాక్టర్లు, 2 వేల కుట్టమిషన్లు అందజేసి, అధికారం అండతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. నంద్యాల, కాకినాడల్లో తమ పార్టీ బలంగానే ఉందన్నారు. ఈ ఓటమి వచ్చే ఎన్ని కలపై ఎలాంటి ప్రభావమూ చూపబోదని, కేవలం పోలీసుల అండతో టీడీపీ గెలిచిందన్న విషయాన్ని ప్రతి కార్యకర్తా గుర్తుంచుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.