‘జగన్‌ను సీఎం చేద్దాం.. సిద్ధంగా ఉండండి’ | ysrcp mp mithun reddy takes on chandrababu naidu | Sakshi

‘జగన్‌ను సీఎం చేద్దాం.. సిద్ధంగా ఉండండి’

Jun 8 2017 3:09 PM | Updated on Aug 9 2018 8:35 PM

‘జగన్‌ను సీఎం చేద్దాం.. సిద్ధంగా ఉండండి’ - Sakshi

‘జగన్‌ను సీఎం చేద్దాం.. సిద్ధంగా ఉండండి’

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు.

అనంతపురం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు. గురువారం మడకశిర నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది. సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశం ఏర్పాటయింది. దీనికి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌ నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎల్‌ఎం మోహన్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ అమరావతి పేరుతో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చిన్నపాటి వర్షానికే అసెంబ్లీలో లీకులు బాబు అవినీతికి నిదర్శనం అని చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం నాణ్యతా రహితంగా నిర్మించారని ఆరోపించారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో బాబు మరో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అవినీతి రహిత పాలన, ఆదర్శ పాలన చూడాలంటే వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకై పార్టీ కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement