మాట నెరవేర్చిన నేత వైఎస్ | Fulfilled promises leader YS | Sakshi
Sakshi News home page

మాట నెరవేర్చిన నేత వైఎస్

Published Sun, Sep 6 2015 3:43 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

మాట నెరవేర్చిన నేత వైఎస్ - Sakshi

మాట నెరవేర్చిన నేత వైఎస్

రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల కంటే ఎక్కువ నెరవేర్చిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని...

- ప్రజలను మోసగించేది చంద్రబాబు
- దిగువమాచిరెడ్డిగారిపల్లెలో ఎంపీ మిథున్‌రెడ్డి
నిమ్మనపల్లె :
రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల కంటే ఎక్కువ నెరవేర్చిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని, నెరవేర్చలేని వాగ్దానా లు చేసి ప్రజలను దగాచేసే వ్యక్తి ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి  మిథున్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని దిగువమాచిరెడ్డిగారిపల్లెలో టీటీడీ నిధులు రూ.11 లక్షలతో నిర్మిస్తున్న నూతన రామస్వామి దేవాలయానికి ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఎంపీ మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి చెప్పిన మాట ప్రకారం రైతు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మనుసు దోచుకున్నారన్నారు.

చంద్రబాబు చెప్పిన మాటను నెరవేర్చకపోగా, దాన్ని మాఫీ చేసుకోవడానికి తప్పుడు మాటలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదైన రాజంపేట నియోజకవర్గంలో తాగునీరు దొరకని పరిస్థి తి ఏర్పడిందన్నారు. నియోజకవర్గం లోని 33 మండలాల్లో తాగునీటి సమ స్య పరిష్కారానికి తమ నిధులను వినియోగించానన్నారు. నిమనపల్లె మండలంలో 11గ్రామాలకు తాగునీటి వసతి కల్పించామన్నారు. అనంతరం  ఎద్దులవారిపల్లెలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ రామస్వామి గుడిలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మైనారిటీల రాష్ట్ర సహా య కార్యదర్శి బాబ్‌జాన్, మదనపల్లె కౌన్సిలర్ జింకా వెంకటాచలపతి,  మదనపల్లె ఎంపీపీ సుజన బాలకృష్ణారెడ్డి, రామసముద్రం ఎంపీపీ జరీన హైదర్‌బేగం, సర్పంచ్ నాగరాజ, ఎంపీటీసీ సభ్యులు రమ్య, హజీరామ్‌బీ, యశోదమ్మ, రుఖియాబేగం, లక్ష్మీనారాయణ, శంకర, గోపాల్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement