కువైట్‌లో పెనగలూరు మండల వాసి మృతి | in kuvait pengaluru person died | Sakshi
Sakshi News home page

కువైట్‌లో పెనగలూరు మండల వాసి మృతి

Published Wed, Oct 26 2016 11:57 PM | Last Updated on Thu, Aug 9 2018 8:35 PM

in kuvait pengaluru person died

కడప కార్పొరేషన్‌:  రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం తూరుపుపల్లెకు చెందిన రాయపూరి ఈశ్వరయ్య(48)ఈ నెల 23వ తేదీ కువైట్‌లో గుండెపోటుతోమృతి చెందినట్లు వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్, కువైట్‌ కన్వీనర్‌ ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. 8 సంవత్సరాలుగా కువైట్‌లోని ఓ కంపెనీలో కార్పెంటర్‌గా పనిచేస్తున్న ఈశ్వరయ్య 23వ తేది ఉదయం గుండెపోటుతో మరణించాడన్నారు. మతునికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి  భారత రాయబార కార్యాలయంలో చట్టబద్ధమైన కార్యక్రమాలన్నీ వైఎస్‌ఆర్‌సీపీ అభిమాని కంచర్ల నాగసుబ్బారెడ్డి పూర్తి చేశారు. ఈశ్వరయ్య మృతదేహం కువైట్‌ ఎయిర్‌వేస్‌ ద్వారా ఈనెల 25వ తేదీ రాత్రి కువైట్‌ నుంచి బయలుదేరి 26వ తేది చెన్నైకి చేరింది. చెన్నై నుంచి పెనగలూరు మండలంలోని తూరుపుపల్లెకు తీసుకుపోవడానికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. కువైట్‌ ఆసుపత్రిలో ఈశ్వరయ్య మృతదేహాన్ని వైఎస్సార్‌సీపీ కువైట్‌ కన్వీనర్‌ బాలిరెడ్డి, కో కన్వీనర్‌ గోవిందునాగరాజు, సభ్యుడు గాలివీటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బాలు, రమణ, మురళీరెడ్డి, యల్లారెడ్డి తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement