దేశవ్యాప్తంగా భూ సేకరణకు ఒకే విధానం ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భూ సేకరణకు ఒకే విధానం ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్కు వేలాది ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటుందని మంగళవారం ఆయన పేర్కొన్నారు. భూ సేకరణ బిల్లుపై వైఎస్ఆర్ సీపీ చేపడుతున్న ఆందోళనను పట్టించుకోకుంటే భూ బిల్లును వ్యతిరేకిస్తామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.