సాక్షి, న్యూడిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. మంత్రిని కలిసినవారిలో ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, ఎన్ రెడ్డప్ప, తలారి రంగయ్యలు ఉన్నారు. ఈ భేటీ అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని కలిసినట్టు తెలిపారు. కృష్ణపురం ఉల్లి సమస్యను మంత్రికి వివరించామని చెప్పారు. రైతులు నవంబర్ నుంచి ఉల్లి ఎగుమతి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఉల్లి ఎగుమతికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారని మిథున్‌రెడ్డి గుర్తుచేశారు. తమ వినతిపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. త్వరలోనే ఉల్లి ఎగుమతికి అనుమతి వస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment