ఏపీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి | Unhappiness in the Ap people | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

Published Thu, May 5 2016 2:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఏపీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి - Sakshi

ఏపీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

ఆర్థిక బిల్లుపై చర్చలో ఎంపీ మిథున్‌రెడ్డి

 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదంటూ హోంశాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటనతో ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో బుధవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా రాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి ఇటీవల చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా బీజేపీ, కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేశాయి. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది.

తిరుపతి బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూబీజేపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా దక్కుతుందన్నారు. తాము ఎన్నికైతే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని టీడీపీ-బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి అంశంగా పెట్టారు. బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వం వారి మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం..’ అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement