
నల్లధనం ఎంతో అంచనాల్లేవు
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లోని నల్లధనం మొత్తాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి అధికారిక అంచనాల్లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. దేశ విదేశాల్లోని నల్లధనం మొత్తాలను, వెనక్కి తెచ్చేందుకు చేపట్టిన చర్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మరో ఎంపీ లక్ష్మీనారాయణ యాదవ్ శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బదులిచ్చారు. దేశ, విదేశాల్లో లెక్కకు రాని ధనాన్ని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్‌ఐపీఎఫ్‌పీ, ఎన్‌సీఏఈఆర్, ఎన్‌ఐఎఫ్‌ఎంల నివేదిక అందిందని, దానిపై పరీక్షిస్తున్నట్టు తెలిపారు.