
'కిరణ్ మహానటుడు'
రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారికిరణ్‌కుమార్‌రెడ్డిని మించిన నటుడు రాష్ట్రంలో లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారికిరణ్‌కుమార్‌రెడ్డిని మించిన నటుడు రాష్ట్రంలో లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక దేశాయ్ పంక్షన్‌హాల్‌లో సమైక్య శంఖారావం పోస్టర్లను ఆవిష్కరించారు. నాలుగు నెలలుగా సీమాంధ్రకు చెందినకోట్లాది మంది ప్రజ లు ఆందోళన చేస్తుంటే సీఎం కిరణ్ సమైక్యం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అడుగులకు మడుగులోత్తుతూ అటు కేంద్ర నాయకులను, ఇటు రాష్ట్ర నాయకులను నమ్మిస్తూ సమైక్యవాది నటించడం ఆయనకే చెల్లిందన్నారు.
సీఎం హోదాలో అసెంబ్లీలో బిల్లును అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికిన కిరణ్ చెప్పిన మాటలకు చేస్తున్న చేతలకు పొంతనలేకుండా ఉందన్నారు. అధిష్టానం చేతిలో కీలు బొమ్మలా మారిన కిరణ్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కులేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయకపోగా కళ్లబొల్లిమాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తున్న వీరికి రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న కృతనిశ్చయంతో, దృఢసంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా సమైక్యశంఖారావం పేరుతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి మాట్లాడుతూ ఈనెల 30వతేదీన జగన్‌మోహన్‌రెడ్డి మదనపల్లెకు రానున్నారని తెలిపారు. బెంగళూరు బస్టాండ్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు సమైక్యాదులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదే విధంగా మదనపల్లెలో ఓదార్పుయాత్రను కూడా జగన్ చేపట్టనున్నారని పేర్కొన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఈనెల31న తంబళ్లపల్లె నియోజకవర్గంలో సమైక్యం కోసం నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త షమీంఅస్లాం, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉదయ్‌కుమార్, రాష్ట్ర మైనార్టీసెల్ ప్రధాన కార్యదర్శి అక్తరహ్మద్, మైనార్టీ నాయకులు పీఎస్ ఖాన్, బాబ్‌జాన్, సింగిల్‌విండో ప్రెసిడెంట్ ఆనంద్, మహిళా నాయకురాలు శ్రీదేవి, కొంగాపద్మావతి, వైజయంతి, రోలింగ్ మల్లిక మరియు నియోజకవర్గంలోని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.