
సాక్షి, వైఎస్ఆర్ కడప: ఫాతిమ మెడికల్ కళాశాల విద్యార్థుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాజంపేట వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలవరం, ప్రత్యేక హోదాలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అవినీతిపై వైఎస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలవరం గురించి ఎప్పుడు ప్రస్తావించినా... ఇది ఇక్కడ సాధ్యం కాదు, ఢిల్లీలో అన్నీ సర్దుకుంటాయంటారని మిథున్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.