ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మంగళవారం లోక్సభలో డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మంగళవారం లోక్సభలో డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం ఉందని, వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక ప్యాకేజీ భాగం మాత్రమే అని, పోలవరంతో పాటు విభజన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని మిథున్ రెడ్డి కోరారు. రైతులకు మద్దతు ధరతో పాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.