కేంద్ర ప్రభుత్వంపై 13సార్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినా లోక్‌సభలో చర్చకు రాలేదని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, వారు దిగిరాక తప్పదని అన్నారు. తమ శక్తిమేరకు ప్రత్యేక హోదా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. జల్లికట్టు ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేయడంతో సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టాల్సి వచ్చిందని, అదేవిధంగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి తమతో కలిసి రావాలని, అందరూ కలిసికట్టుగా పోరాడితేనే కేంద్రం దిగివస్తుందని మిథున్‌రెడ్డి తెలిపారు.