
పరనిందలతో ప్రభుత్వం కాలయాపన
అవినీతిలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్
జన్మభూమి కమిటీలతోనే టీడీపీ పతనం
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
మదనపల్లె: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ప్రజల ఇబ్బందులు తీరుద్దామన్న ధ్యాస లేకుండా ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలతో కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం అవివేకమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మి«థున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం రాజంపేట పరిధిలోని నియోజకవర్గాల సమస్యలపై సబ్‌కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ మూడేళ్ల పాలనపై స్పందిస్తూ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలలో కనీసం 5శాతం కూడా నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, కనీస మద్దతు ధర లేకుండా రైతులు విలవిల్లాడుతున్నారని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు రూ.5వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, ఐదు రూపాయలు కూడా ఇవ్వకుండా రైతులను దగా చేస్తోందన్నారు.
రైతులకు అండగా జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితిని వివరిస్తే, అదేదో తప్పయినట్లు ఆయనపై నిందలు మోపి తప్పించుకోవాలని చూస్తోందన్నారు. మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో కాకుండా అవినీతిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందన్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యం ఇస్తూ టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. జన్మభూమి కమిటీలతోనే 2019 ఎన్నికలలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనమయ్యాయని, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు నారాయణరెడ్డి హత్యే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బాబ్‌జాన్, ఉదయ్‌కుమార్, మహిళా విభాగం కా ర్యదర్శి షమీం అస్లాం, కౌన్సిలర్లు జిం కా వెంకటాచలపతి, సుగుణ ఆంజనేయులు, రఫీ, బాలగంగాధర రెడ్డి, సర్పంచ్ శరత్‌రెడ్డి, చిప్పిలి జగన్నాథరెడ్డి, షరీఫ్, కరీముల్లా, రవిచంద్రారెడ్డి, కోటూరి ఈశ్వర్, మహేష్, జన్నె రాజేంద్రనాయుడు, సుబ్రహ్మణ్యం, మిద్దింటి కిషోర్, మేస్త్రీ శ్రీనివాసులు, సెల్వి, శారదారెడ్డి పాల్గొన్నారు.