
ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి...
ఎంపీ మిథున్, బాబ్‌జాన్‌కు జగన్ సూచన
మదనపల్లె: గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాబ్‌జాన్‌కు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. శని వారం హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిసిన నేతలతో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణపై పలు సూచనలు అందజేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రి ఏ విధంగా మో సగిస్తున్నారో స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలని చెప్పా రు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ,మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ భాగస్వాములయ్యేలా చూడాలని ఆదేశించారు.