యూనివర్సిటీక్యాంపస్‌ః రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి గన్‌మెన్లను తగ్గించడం ప్రభుత్వ కుట్ర అని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి. హరిప్రసాద్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే ప్రజాప్రతినిధికి గన్‌మెన్లను తగ్గిం చడం అన్యాయమన్నారు. ప్రజల మధ్యలేని నాయకులకు 2+2 గన్‌మెన్లను ఇవ్వడం, మిథున్‌రెడ్డికి 1+1 ఇవ్వడం బాధాకరం. జిల్లాలో ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రజలం తా మెచ్చుకుంటుంటే సీఎం ఓర్వలేక ఆయన పై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన్ను రాజకీయం గా ఎదుర్కొలేక నీచరాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాధారణను తగ్గించలేరన్నారు.
మిథున్‌రెడ్డికి గన్‌మెన్లను తగ్గించడం కుట్రే
Published Sun, May 8 2016 2:38 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement