రుణమాఫీ.. ఓ బోగస్
రాజంపేట: తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటిస్తున్న రుణమాఫీ పథకం బోగస్‌గా మారిందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక జీఎంసీ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రాల రుణమాఫీ అయ్యే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడే అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసులురెడ్డి, జీఎంసీ క్లబ్ సెక్రటరీ రాజమోహన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పాపినేని విశ్వనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ సేవాదళ్ కన్వీనర్ శిల్పి రాజాచారి, పార్టీ మండల కన్వీనర్ నాగినేని నాగేశ్వరనాయుడు, నాయకులు నడివీధి సుధాకర్, ఆకేపాటి రమేష్‌రెడ్డి, గోవిందు బాలకృష్ణ, పసుపులేటి సుధాకర్, డీలర్ సుబ్బరామిరెడ్డి, రమేష్‌నాయుడు పాల్గొన్నారు.
గ్రామీణులకు సేవలందిస్తున్న ఏపీజీబీ:
సీమ జిల్లాలో గ్రామీణులకు సేవలందిస్తున్న ఏకైక బ్యాంక్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అని రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జీఎంసీ క్లబ్‌లో ఏపీజీబీ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో స్వయంసహాయకసంఘాలకు రూ.56 లక్షల రుణాలను ఎంపీ చేతుల మీదుగా అందచేసే కార్యక్రమాన్ని ఏపీజీబీ నిర్వహించింది.
మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో కార్పొరేట్ బ్యాంకులు ధనికులకే పరిమితమయ్యాయని, ఒక్క ఏపీజీబీ మాత్రం పల్లెవాసులకు అండగా నిలుస్తోందన్నారు. ఏపీజీబీ జీఎం కృష్ణమాచారి, రాజంపేట ఆర్డీవో ప్రభాకర్‌పిళ్లై, రీజనల్ మేనేజరు శివశంకరరెడ్డి, రాజంపేట మెయిన్‌బ్రాంచి చీఫ్ మేనేజర్ చంద్రపాల్‌రెడ్డి, డీఆర్‌డీఏ డీపీఎం అశోక్‌రెడ్డి మాట్లాడారు.
కార్యక్రమంలో ఆకేపాటి సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి, మాజీ ఏజీపీ గురుప్రతాప్‌రెడ్డి, , వైఎస్సార్‌సీపీ పట్టణ యూత్ అధ్యక్షుడు యల్లమరాజు సురేష్‌రాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు కుందా నెల్లూరు మధు, జీవీ సుబ్బారెడ్డి, భాస్కర్‌రాజు, కొప్పల సుబ్బన్న, జాహిద్‌అలీ, బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.