టీడీపీ రాక్షస క్రీడ | Chandrababu provoked TDP Leaders to Attack On Police And YSRCP | Sakshi
Sakshi News home page

టీడీపీ రాక్షస క్రీడ

Published Sat, Aug 5 2023 3:40 AM | Last Updated on Sat, Aug 5 2023 7:46 AM

Chandrababu provoked TDP Leaders to Attack On Police And YSRCP - Sakshi

పుంగనూరు బైపాస్‌ వద్ద పోలీసుల వాహనాలను ధ్వంసం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు

సాక్షి, తిరుపతి/చిత్తూరు/ పుంగనూరు/బి కొత్త­కోట: రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్య­క్షుడు చంద్రబాబు పక్కా స్కెచ్‌తో అగ్గి రాజే­శారు. టీడీపీ గూండాలను రెచ్చగొట్టి.. పోలీసులు, వైఎస్సార్‌­సీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలు, బీరు బాటి­ళ్లతో దాడులు చేయించారు. అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర రక్త గాయా­లతో ఆస్పత్రి పాలయ్యారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రాజెక్టుల సందర్శన పేరుతో శుక్రవారం ఆయన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. ములకలచెరువు మండలం నాయనపల్లి చెరువు వద్ద ఉన్న హంద్రీ–నీవా, గాలేరు నగరి అను­సంధానం కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత  బి కొత్తకోట మండలం చీతివారిపల్లి సమీ­పంలో ఉన్న హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ పనులను పరిశీలించాల్సి ఉండింది. అయితే పుంగనూరులో విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతో రూట్‌ మ్యాప్‌ మార్చుకున్నారు.

తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల పరిధిలోని ముదివేడు రిజ­ర్వాయర్‌ పరిశీలనకు వెళ్తున్నారని తెలుసుకున్న స్థాని­కులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు బాబు తీరుపై మార్గం మధ్యలోని అంగళ్లు సర్కిల్‌ వద్ద నిరసన తెలిపి వెనుదిరిగారు. అంతలో అక్కడికి చేరుకున్న చంద్ర­బాబు బృందం వందలాది మందితో వచ్చీ రాగానే కేకలు వేస్తూ... తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబ­డ్డారు. దూరంగా ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణు­లను రెచ్చగొ­ట్టారు. డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు, పోలీ­సులు ఎంతగా వారించినా వినలేదు. స్థానికులు భయాందోళ­నతో ఇళ్లలోకి పరుగులు తీశారు.

టీడీపీ గూండాల రాళ్ల దాడిలో ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ కేశవ, అంగళ్లకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త అర్జున్‌రెడ్డి (35) తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువుకు చెందిన విశ్వనాథ­రెడ్డి సహా మరో పది మందికి గాయాలయ్యాయి. ఇంత జరుగు­తు­న్నా చంద్రబాబు వారించడం అటుం­­చి, చోద్యం చూశా­రు. పైగా జీపుపైకి ఎక్కి రెచ్చగొట్టేలా మాట్లాడారు. 
పోలీసులపై రాళ్లు విసిరి దాడికి పాల్పడుతున్న టీడీపీ శ్రేణులు   

పుంగనూరు పుడింగితో తేల్చుకుందాం రండి
అంగళ్ల వద్ద నుంచి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు బైపాస్, పలమనేరు మీదుగా చంద్రబాబు చిత్తూరుకు చేరుకోవాల్సి ఉంది. చంద్రబాబు రూట్‌ మ్యాప్‌లో పుంగనూరు ప్రస్తావన లేదు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు.. పుంగనూరుకు వెళ్దాం.. రండి అంటూ టీడీపీ గూండాలకు మైక్‌ ద్వారా పిలుపునిచ్చారు. ‘పుంగనూరులో పుడింగి ఉన్నాడు.. రండి తేల్చుకుందాం’ అని గట్టిగా అరుస్తూ ముందుకు కదిలారు.

బాబు పిలుపుతో పుంగనూరు వద్ద విధ్వంసం 
అంగళ్ల వద్ద చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు పుంగనూరు వద్ద టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో అధినేత రాకముందే గుమిగూడారు. ఒక్కసారిగా బైపాస్‌ రోడ్డు వద్దకు చేరుకున్నారు. పుంగనూరు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా వినిపించుకోకుండా గొడవకు దిగారు. ఒక ఏఎస్పీ, డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు సుమారు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతలో చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు.

వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ గూండాలను వెనకేసుకుని బైపాస్‌ రోడ్డులోని భీమగానిపల్లె సర్కిల్‌ నుండి పుంగనూరులోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘పుంగనూరులో కాలుమోపుతా.. ఎవరు అడ్డుకుంటారో? చూస్తా?’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎంతగా వారించినా వినలేదు. పైగా పోలీసులను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ శ్రేణులు తొలుత రాళ్ల వర్షం కురిపించాయి. ఆ తర్వాత కర్రలతో పోలీసులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు.

ముందస్తుగా సిద్ధం చేసుకున్న బీరు బాటిళ్లు, మద్యం సీసాలు పోలీసులపైకి విసిరి తీవ్రంగా గాయపరిచారు. పోలీసు గస్తీ కోసం ఏర్పాటు చేసిన వజ్ర వాహనాన్ని, మరో పోలీసు వాహనాన్ని కిందకు పడదోసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఎంతగా సంయమనం పాటించి, సర్దిచెప్పినప్పటికీ వారు వినకపోవడంతో పోలీసులు వారిపైకి బాష్ప వాయువు ప్రయోగించి చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ విధ్వంసం గంటన్నరకుపైగా సాగింది. 

27 మందికి గాయాలు 
టీడీపీ శ్రేణుల దాడిలో ఏఎస్పీ, డీఎస్పీతోపాటు ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు మొత్తం 27 మందికి రక్త గాయాలయ్యాయి. సాయంత్రం 4 నుండి 5.30 గంటల మధ్య పుంగనూరు బైపాస్‌రోడ్డు ప్రాంతం రణరంగాన్ని తలపించింది. చిత్తూరు ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు, దిశ స్టేషన్‌ డీఎస్పీ బాబుప్రసాద్, క్రైమ్‌ సీఐ భాస్కర్, పాల­సముద్రం ఎస్‌ఐ ప్రసాద్‌లకు తీవ్రగాయాల­య్యాయి. గాయపడ్డ వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గాయపడ్డ పోలీసుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫొటోలు, వీడియోల్లో పోలీసు అధికారులు, సిబ్బంది రక్త గాయాలతో ఉండటం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని పోలీసులపై టీడీపీ శ్రేణులు ఇలా దాడులు చేసి గాయ పరచడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించారు. అనంతరం అనంతపురం రేంజి డీఐజీ అమ్మిరెడ్డితో కలిసి పుంగనూరులో ఘటన వివరాలను మీడియాకు వివరించారు. కాగా, గొడవ విçషయం తెలిసి పుంగనూరు బైపాస్‌ రోడ్డు వద్దకు చేరుకున్న స్థానిక వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో 50 మందికి టీడీపీ నేతల రాళ్ల దాడిలో తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులపైకి రాళ్లు విసురుతూ దూసుకొస్తున్న టీడీపీ శ్రేణులు 

అంతా వ్యూహాత్మకం
చిత్తూరు అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్‌ఎస్‌జీ కమాండోల రక్షణలో జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు  ఎక్కడైనా పర్యటించాలంటే 24 గంటల ముందుగా చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో) నుంచి ఇంటెలిజెన్స్‌ విభాగానికి రోడ్‌ మ్యాప్‌ ఇవ్వాలి. అప్పుడు జిల్లా పోలీసుశాఖ ముందుగా రూట్‌ మ్యాప్‌లో ఉన్న కల్వర్టులు, శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. బాంబ్‌ స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌), ఆర్మ్‌డ్‌ రిజర్వు దళాలు చంద్రబాబు కార్యక్రమం జరిగే రూట్‌ మ్యాప్‌లో భద్రతా చర్యలు, ముందస్తు తనిఖీలు చేపడతారు.

కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులకు అందిన రూట్‌ మ్యాప్‌ ఒకలా ఉంటే.. దాన్ని కాదని పుంగనూరులోకి పర్యటనను మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది. మదనపల్లె నుంచి పుంగనూరు బైపాస్‌ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివారుల్లోని బాన్స్‌ హోటల్‌కు వెళతారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది. గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ.. పుంగనూరు బైపాస్‌ మీదుగానే వెళ్లిపోతారని చెప్పారు. తీరా శుక్రవారం సాయంత్రం పుంగనూరులోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు. 

రాజంపేట టీడీపీ అభ్యర్థి నరహరి కారులో గన్‌ 
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా  రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్‌ గుర్‌మిత్‌ సింగ్‌(38)పై ముదివేడు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మదనపల్లె రూరల్‌ సీఐ శివాంజనేయులు కథనం ప్రకారం.. చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగళ్లుకు నరహరి కారు వేగంగా వచ్చింది. కడప రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఎంపీటీసీ మహే‹Ùపైకి దూసుకొచ్చింది.  

మహేష్‌ హెచ్చరికతో కారు ఆగింది.  అంత వేగమెందుకని  మహేష్‌ నిలదీయగా..  ఆగ్రహించిన గురుమిత్‌సింగ్‌ కారులోంచి డబుల్‌ బ్యారల్‌ గన్‌ తీసి కాల్చుతానంటూ బెదిరించారు. దీంతో  మహేష్‌ ముదివేడు పోలీసులకు చెప్పగా వారు కారును తనిఖీ చేశారు.పేకాట పెట్టెలు, వెనుకవైపు కింద డబుల్‌ బ్యారల్‌ గన్, సీటు కవర్‌లో ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్‌ లభించాయి. వీటితోపాటు కారును స్వాదీనం చేసుకుని ముదివేడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధితుడు మహేష్‌ ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ గుర్‌మిత్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.  

రెచ్చగొట్టే ప్రసంగాలతోనే విధ్వంసం 
రెచ్చగొట్టే ప్రసంగాలతో పథకం ప్రకారం విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు జరగడం బాధాకరం. ఇలాంటి మాటలు సమాజానికి మంచిది కాదు. గాయపడిన పోలీసుల పరిస్థితి ఇది.. తెలుగుదేశం వారు ఉపయోగించిన రాళ్లివి (వీడియో చూపుతూ). అనుమతి పొందిన రూట్‌మ్యాప్‌ను కాదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పుంగనూరులోకి వచ్చే ప్రయత్నం చేయడంతోనే విధ్వంసం జరిగింది.  

పోలీస్‌ అధికారుల వద్ద పిస్టల్‌ ఉన్నప్పటికీ, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రహించినా సంయమనంతో వ్యవహరించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకూడదని కాల్పులు జరపలేదు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా దాడులు చేసిన వారిని గుర్తిస్తాం. బాధ్యులందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, అరెస్ట్‌ చేస్తాం. విధ్వంసం సృష్టించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
– అమ్మిరెడ్డి, అనంతపురం రేంజ్‌ డీఐజీ 

ముందస్తు పథకం ప్రకారమే దాడులు 
ముందస్తు పథకం ప్రకారం విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై దాడి చేశారు. రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పోలీస్‌ వాహనాలను సైతం తగులబెట్టడం దారుణం. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు. చట్ట ప్రకారం వారందరిపై కేసులు నమోదు చేస్తాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం.

రూట్‌ మ్యాప్‌లో లేకపోయినా.. టీడీపీ నాయకులు కొంత మంది కావాలనే నిబంధనలకు విరుద్దంగా పుంగనూరులోనికి రావడానికి ప్రయత్నించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిలువరించినందుకే దాడి చేశారు. పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించి, దెబ్బలు తిన్నప్పటికీ కాల్పులు జరపలేదు. గొడవనంతటినీ వీడియో చిత్రీకరించాము. చట్టప్రకారం బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తాం.  
– రిషాంత్‌రెడ్డి, చిత్తూరు ఎస్పీ

నేడు చిత్తూరు జిల్లా బంద్‌
పుంగనూరులో చంద్రబాబు అను­చరగణం సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ, పోలీసు­లపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ శనివారం చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా అంగళ్లు కూ­డలిలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ దాష్టీకంపై పెద్దఎత్తున నిరసన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement