
సాక్షి, విజయవాడ: ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 2015 టీడీపీ హయాంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో అధికారులపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరిపిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు.. కేసును కొట్టేసింది.
చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలతో సహా మరో 16 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నేడు తీర్పును వెల్లడించింది.
ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా?
Comments
Please login to add a commentAdd a comment