vijayawada court
-
ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట
సాక్షి, విజయవాడ: ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 2015 టీడీపీ హయాంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో అధికారులపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరిపిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు.. కేసును కొట్టేసింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలతో సహా మరో 16 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నేడు తీర్పును వెల్లడించింది. ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా? -
రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు.. ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు
రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు తరలింపు ప్రత్యేక భద్రత నడుమ చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న పోలీసులు చంద్రబాబుకు రాజమండ్రి జైలును కేటాయిస్తూ వారెంట్ జారీ ► రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న చంద్రబాబు. చంద్రబాబుకు ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు. ►కొవ్వూరు టోల్గేట్ దటిన చంద్రబాబు కాన్వాయ్, ఫోర్త్ బ్రిడ్జి మీదుగా కొవ్వూరు నుండి దివాన్ చెరువుకు ప్రవేశించనున్న చంద్రబాబు కాన్వాయ్. హైవే మీదుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోనున్న చంద్రబాబు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద 300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు సెంట్రల్ జైలు రోడ్డు బ్లాక్ చేసిన పోలీసులు. ►ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలను పరిశిలించిన ఏసీబీ కోర్టు తీవ్ర ఉత్కంఠత నడుమ తీర్పును ప్రకటించింది. చివరకు చంద్రబాబుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడును ఆదివారం కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఉదయం నుండి దాదాపు ఏడున్నర గంటలకు పైగా వాదనలు జరిగాయి. వాదనలు ముగిశాక కోర్టు కాంపౌండులో కొంత హైడ్రామా నడిచిన తర్వాత ఏసీబీ జడ్జి సీఐడీ వాదనలతో ఏకీభవిస్తున్నటు తెలుపుతూ చంద్రబాబుకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ►సిఐడి అధికారులు సిద్ధం చేసిన రిమాండు రిపోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూనే చంద్రబాబు నేరానికి పాల్పడ్డారని, తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ►మొత్తం రూ. 371 కోట్ల కుంభకోణమని అభియోగం మోపారు. దీనిలో సీమెన్స్ 90 శాతం ఖర్చు భరిస్తుందని క్యాబినెట్లో అబద్ధాలు చెప్పారని, నోట్ ఫైల్‌ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు అప్రూవల్ చేశారని సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్థికశాఖ కార్యదర్శి అభ్యంతరం చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని ఆనాడు సీఎం, సీఎస్ ఆదేశాలతోనే నిధులు విడుదలయ్యాయని, షెల్ కంపెనీల ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ. 259 కోట్లు మళ్లించారని రిపోర్టులో స్పష్టం చేశారు. ►ఆదివారం ఉదయాన్నే ఏసీబీ కోర్టులో వాదనలు జరిగగా చంద్రబాబు తరుఫున సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరుఫున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి న్యాయమూర్తికి వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ జడ్జి సాయంత్రం తీర్పును వెలువరించింది. ఈ నెల 22 వరకు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైలే -
ఎన్ఐఏ దర్యాప్తులో చాలా లోపాలున్నాయి
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తులో చాలా లోపాలున్నాయని సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు సోమవారం ఎన్ఐఏ కోర్టుకు నివేదించారు. ఎన్ఐఏ సరైన దిశలో దర్యాప్తు చేయలేదని.. అనేక కీలక అంశాలను సమాధానాల్లేని ప్రశ్నలుగా మిగిల్చిందని ఆరోపించారు. దర్యాప్తును తూతూ మంత్రంగా పూర్తి చేసిందన్నారు. చార్జిషీట్‌ను కూడా చాలా హడావుడిగా దాఖలు చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై మొదట దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పలు కీలక సాక్ష్యాలను సేకరించిందన్నారు. అయితే ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ మాత్రం ఆ సాక్ష్యాలను ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. అందుకే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టుకు నివేదించారు. ఎంట్రీ పాస్ లేకుండానే విమానాశ్రయంలోకి నిందితుడు.. వైఎస్ జగన్‌పై అక్టోబర్ 25, 2018లో హత్యాయత్నం జరిగిందని.. ఘటనా స్థలంలోనే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. ఆ మరుసటి రోజు శ్రీనివాసరావు ఇంటి నుంచి సిట్ అధికారులు విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఏరోడ్రమ్ ఎంట్రీ పాస్ (ఏఈపీ)ని స్వాధీనం చేసుకున్నారన్నారు. హత్యాయత్నం జరిగిన రోజు ఎలాంటి ఎంట్రీ పాస్ లేకుండానే శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి వెళ్లారని చెప్పారు. పాస్ ఇంటిలోనే ఉన్నప్పుడు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. నిందితుడు కత్తిని లోపలకు ఎలా తీసుకెళ్లాడు? జగన్‌తో కలిసి నిందితుడు ఫొటో దిగినట్లు ఉన్న ఫ్లెక్సీని కూడా సిట్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అసలు ఈ ఫ్లెక్సీని ఎవరు తయారు చేశారు? ఏ ఉద్దేశంతో తయారు చేశారన్న వివరాలను ఎన్ఐఏ పట్టించుకోలేదని కోర్టుకు నివేదించారు. ఫెక్ల్సీ విషయంలో నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు ఇచి్చన వాంగ్మూలాన్ని సిట్, ఎన్ఐఏ రికార్డు చేశాయన్నారు. అయితే ఈ రెండు వాంగ్మూలాలకు వైరుధ్యం ఉందన్నారు. ఇందులో ఏది నిజమో తేల్చాల్సిన బాధ్యత ఎన్ఐఏపై ఉందని కోర్టుకు నివేదించారు. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని గుర్తు చేశారు. లోపల ఉన్న హోటల్లోకి వెళ్లే సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. మరి శ్రీనివాసరావు కత్తి తీసుకుని ఎలా లోపలికి వెళ్లారో ఎన్ఐఏ చెప్పడం లేదన్నారు. ఈ విషయంలో విమానాశ్రయ అప్పటి భద్రతా అధికారులను, సిబ్బందిని ఎన్ఐఏ విచారించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. విమానాశ్రయంలో ఉన్న ఫ్యూజన్ హోటల్లో ఉద్యోగం సంపాదించేందుకు శ్రీనివాçÜరావు తనపై ఎలాంటి కేసులు లేవంటూ స్థానిక పోలీసుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారన్నారు. దీన్ని ఆ హోటల్ యజమాని హర్షవర్ధన్ కూడా ధ్రువీకరించారని గుర్తు చేశారు. హర్షవర్ధన్ కారణంగానే శ్రీనివాసరావుకు అక్కడ ఉద్యోగం వచచిందన్నారు. శ్రీనివాసరావు హాజరు విషయంలో బయోమెట్రిక్ యంత్రాన్ని, సీసీ కెమెరాలను ఎన్ఐఏ సరిగా విశ్లేషించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటి దృష్ట్యా ఈ కేసులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ వాదనలు వినిపించేందుకు ఎన్ఐఏ తరఫు న్యాయవాది సిద్ధిరాములు గడువు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
ప్రజలకు న్యాయవ్యవస్థ చేరువలో ఉండాలి: సీజేఐ ఎన్వీ రమణ
-
కోర్టు భవనాలను సీజేఐ ప్రారంభించడం సంతోషం: సీఎం జగన్
-
విజయవాడ కోర్టుల భవన సముదాయం ప్రారంభం
-
హైకోర్టును కదిలించిన వృద్ధుల పోరాటం
సాక్షి, అమరావతి: జీవిత చరమాంకంలో ఉన్న ఇద్దరు వృద్ధులు దాదాపు దశాబ్దం నుంచి చేస్తున్న న్యాయపోరాటం హైకోర్టును కదిలించింది. ఆ వృద్ధులకు సత్వర న్యాయం అందించాలని విజయవాడ కోర్టును ఆదేశించింది. ఈ వయసులోనైనా న్యాయ ఫలాలను ఆస్వాదించనివ్వాలని, అప్పుడే వారు ఆనందిస్తారని తెలిపింది. రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో రాయితీల మీద పాసులు ఇస్తే వృద్ధులను గౌరవించినట్లు కాదని, సత్వర విచారణ జరిపి వారి కేసులను పరిష్కరిస్తేనే వారిని గౌరవించినట్లని స్పష్టం చేసింది. దాదాపు పదేళ్లుగా ఎలాంటి సహేతుక కారణాలు లేకుండానే ఈ వృద్ధుల పిటిషన్ అపరిష్కృతంగా ఉందని, అందువల్ల వారి వ్యాజ్యాన్ని గరిష్టంగా రెండు నెలల్లో పరిష్కరించాలని విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం తీర్పు వెలువరించారు. వారి అభ్యర్థనను సానుకూల దృక్పథంతో చూడాలి ఓ ఇంటి విషయంలో కింది కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, దీని ప్రకారం తమకు రావాల్సిన ప్రయోజనాలను మదింపు చేసేందుకు వీలుగా అడ్వొకేట్ కమిషన్‌ను నియమించాలని కోరుతూ వెంకట హనుమంత కృష్ణమూర్తి (80), ఉదయ్ ప్రభాకర్ శర్మ (72) విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో 2011లో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ వ్యాజ్యం అలాగే పెండింగ్‌లో ఉండటంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్‌ను పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపి సోమవారం తీర్పు వెలువరించారు. ‘పిటిషనర్లు ఇద్దరూ వయోవృద్ధులు. కింది కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఫలాలను తాము బతికున్నప్పుడే ఆస్వాదిస్తామన్న ఆశతో హైకోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనను సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పర్సన్’ పేరుతో పథకం తీసుకొచ్చింది. దీనికనుగుణంగా 65 ఏళ్లకు పైబడిన వారి కేసులను గుర్తించి, వాటిని ప్రాధాన్యత క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించాలని న్యాయాధికారులను ఆదేశిస్తూ 1999, 2003, 2014ల్లో హైకోర్టు సర్క్యులర్లను జారీ చేసింది. అయినా వృద్ధుల కేసులు తగ్గడం లేదు. కొన్ని కోర్టులు ఏళ్ల తరబడి కేసులను వాయిదా వేస్తున్నాయి. ప్రస్తుత కేసు అందుకు ఉదాహరణ. పిటిషనర్లు 2002లో కింది కోర్టులో పిటిషన్ వేసి 2010లో సానుకూల తీర్పు పొందారు. ఆ తీర్పు ప్రకారం రావాల్సిన ప్రయోజనాల కోసం 2011లో విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ కోర్టు కేసును ఇప్పటికీ పెండింగ్‌లో ఉంచడం చట్ట నిబంధనలకు విరుద్ధం.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
మంత్రి కురసాలపై కేసు కొట్టివేత
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుపై ఎన్నికల సమయంలో నమోదైన కేసును గురువారం న్యాయస్థానం కొట్టివేసింది. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరప పోలింగ్ కేంద్రంలోకి కన్నబాబు అక్రమంగా ప్రవేశించారని ఆయనపై అభియోగం వచ్చిన తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం.. కన్నబాబుపై ఆరోపణలకు రుజువులు లేవని తెలిపింది. అలాగే కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
చింతమనేనిని వదలని కోర్టు కేసులు
సాక్షి, ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కోర్టు కేసులు ముప్పతిప్పలు పెట్టిస్తున్నాయి .ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టై ఏలూరు సబ్ జైలులో ఉన్న చింతమనేనిపై 2011లో కోడి పందాల కేసులో విజయవాడ స్పెషల్ కోర్టు పిటి వారెంట్ జారీ చేసింది. అందులో భాగంగా బుధవారం చింతమనేనిని ఏలూరు సబ్ జైలు నుంచి విజయవాడ స్పెషల్ కోర్టులో హజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి గతంలో వాయిదాలకు హజరు కాకా పోవడంతో పీటీ వారెంట్ జారీ చేసిన విజయవాడ స్పెషల్ కోర్టు బెయిల్ పిటీషన్‌ను రేపటికి వాయిదా వేసింది. చింతమనేనిపై 2011లో యానిమల్ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది. -
ఆయేషా మీరా హత్య కేసు విజయవాడ కోర్టు సిబ్బందిపై కేసు నమోదు
-
నా భార్య చిత్రహింసలు పెడుతోంది..
సాక్షి, విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఓ భర్త గృహహింస చట్టం కింద కోర్టును ఆశ్రయించాడు. తన భార్య తనను చిత్ర హింసలు పెడుతుందంటూ రామ్‌కుమార్ అనే వ్యక్తి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివాహం జరిగి రెండు నెలలకే తన భార్య వేధింపులకు పాల్పడుతోందని విజయవాడ కంచికామకోటి నగర్‌కు చెందిన గోగు రామ్ కుమార్ అనే వ్యక్తి మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ పిటీషన్‌ను స్వీకరించడంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అప్పటికే వివాహమైన సదరు మహిళ .. ఆ సంగతి దాచి తనను మరో వివాహం చేసుకుందని పేర్కొన్నాడు. పెళ్లైన రెండు నెలల నుంచి తనను మానసికంగా, శారీరకంగా ఆమె హింసిస్తోందని రామ్‌కుమార్ ఆరోపిస్తున్నాడు. కాగా, రాష్ట్రంలో ఈ తరహా తొలి కేసు ఇదే కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
విజయవాడ కోర్టు సంచలన తీర్పు
-
విజయవాడ కోర్టు సంచలన తీర్పు
విజయవాడ: యువతులకు మత్తుమందు ఇచ్చి.. వారిపై అత్యాచారం జరిపిన కేసులో విజయవాడ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఓ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి శిక్ష ఖరారు చేసింది. ఏ-1 నిందితుడు నిమ్మకూరి సాయిరామ్‌కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీపక్, అభిలాష్, మున్నాలకు 20 ఏళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది. మరో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. విజయవాడలో 2014 సంవత్సరం ఆగస్టు 23న ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన నిమ్మకూరి సాయిరాం, దీపక్, అభిలాష్, అబ్దుల్ ఖాదర్ అలియాస్ మున్నా, దుర్గా ప్రసాద్ అనే ఐదుగురు యువకులు కొంతమంది యువతులపై అత్యాచారం చేశారు. ఈ ఘటనను వీడియాలుగా తీసి అందరూ షేర్ చేసుకోవటమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురినీ అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో ఐదుగురు నేరం చేసినట్లు నిరూపణ కావడంతో విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ముఠా సభ్యుల్లో ఓ మైనర్ బాలుడు ఉండటంతో అతడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. -
'ఈ కేసులో అకారణంగా ఇరికించారు'
విజయవాడ : కాల్‌మనీ కేసులో అకారణంగా తనను ఇరికించారని డీఈ సత్యానందం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలో డీఈ సత్యానందం మాట్లాడుతూ... తాను ఉద్యోగ సంఘం నేతగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ ఏ బి వెంకటేశ్వరరావును కలిసినట్లు తెలిపారు. కాల్‌మనీ కేసులో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఈ సందర్భంగా డీఈ సత్యానందం స్పష్టం చేశారు. -
విజయవాడ కోర్టులో సత్యానందం ప్రత్యక్షం
విజయవాడ: కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుల్లో ఒకరైన ఏపీఎస్పీడీసీఎల్ డివిజినల్ ఇంజనీర్ ఎం.సత్యానందం గురువారం విజయవాడలోని ఒకటో మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్ కోసం పూచీకత్తు సమర్పించారు. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో సత్యానందం ఏ4 నిందితుడిగా ఉన్నారు. సత్యానందంకు హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్షతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులో పోలీసులు కీలక వ్యక్తి శ్రీరామ్మూర్తి, మరికొందరిని అరెస్ట్ చేయగా, సత్యానందం ఇప్పటివరకు పరారీలో ఉన్నారు. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో తన అరెస్ట్ తప్పదని గ్రహించిన సత్యానందం ముందస్తు బెయిల్ కోసం నేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ లభించడంతో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. -
'మత్తయ్య కాల్‌డేటా వివరాలు ఇవ్వండి'
ఓటుకు కోట్లు కేసులో ఎ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య కాల్‌డేటా వివరాలు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం కోర్టు ద్వారా కోరింది. దాంతో, మత్తయ్య కాల్ డేటా వివరాలను సీఐడీకి ఇవ్వాలని టెలికాం ఆపరేటర్లకు విజయవాడ కోర్టు ఆదేశాలిచ్చింది. రిలయన్స్, ఎయిర్టెల్, ఐడియా టెలికాం ఆపరేటర్లకు విజయవాడ కోర్టు నుంచి నోటీసులు వెళ్లాయి. విజయవాడ మూడో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు నోటీసులు జారీ చేసింది. మే 1 నుంచి జూన్ 20వ తేదీ వరకు మత్తయ్య కాల్ డేటా వివరాలను సీఐడీ విభాగానికి ఇవ్వాలని ఆయా ఆపరేటర్లను విజయవాడ కోర్టు ఆదేశించింది. -
'మంత్రి నారాయణపై కేసు నమోదు చేయండి'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణపై కేసు నమోదు చేయాలని విజయవాడ కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే విజయవాడ మొగల్రాజపురంలోని నారాయణ ఐఐటీ ఒలంపియాడ్ స్కూల్ ప్రిన్సిపాల్ సూరయ్యలపై చీటింగ్, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించాలని విజయవాడ ఒకటవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మహ్మద్ రఫీ మాచవరం పోలీసులను మంగళవారం ఆదేశించారు. విశాఖపట్నానికి చెందిన ఫిర్యాది ఐతా రామలింగేశ్వరరావు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. తన కుమారుడు రామసాయి అనుదీప్‌ను 2010 జూన్‌లో మొగల్రాజపురంలోని నారాయణ ఐఐటీ ఒలంపియాడ్ స్కూల్లో 8వ తరగతిలో చేర్పించారు. 2011 జూన్ 12న ఫిర్యాది భార్య తొమ్మిదో తరగతికి ఫీజు చెల్లించేందుకు రాగా...ప్రిన్సిపాల్ రూ.90వేలు చెల్లించాలన్నారు. ఏడాదికి రూ.85 వేలకు చొప్పున మూడేళ్లకు మాట్లాడుకున్నాం కదా మళ్లీ ఇప్పుడు పెంచటమేంటని బాధితుడు ప్రశ్నించగా ప్రిన్సిపాల్ సరిగా స్పందించకపోగా...అవమానకరంగా ప్రవర్తించారు. దాంతో బాధితుడు కోర్టులో ప్రయివేటు ఫిర్యాదు దాఖలు చేయగా న్యాయమూర్తి పైవిధంగా ఆదేశించారు.