విజయవాడ కోర్టు సంచలన తీర్పు | vijayawada court verdict on rape case | Sakshi
Sakshi News home page

విజయవాడ కోర్టు సంచలన తీర్పు

Published Wed, Jan 4 2017 5:45 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

విజయవాడ కోర్టు సంచలన తీర్పు

విజయవాడ కోర్టు సంచలన తీర్పు

విజయవాడ: యువతులకు మత్తుమందు ఇచ్చి.. వారిపై అత్యాచారం జరిపిన కేసులో విజయవాడ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఓ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి శిక్ష ఖరారు చేసింది. ఏ-1 నిందితుడు నిమ్మకూరి సాయిరామ్‌కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీపక్‌, అభిలాష్‌, మున్నాలకు 20 ఏళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది. మరో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. విజయవాడలో 2014 సంవత్సరం ఆగస్టు 23న ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

విజయవాడకు చెందిన నిమ్మకూరి సాయిరాం, దీపక్‌, అభిలాష్‌, అబ్దుల్‌ ఖాదర్‌ అలియాస్‌ మున్నా, దుర్గా ప్రసాద్‌ అనే ఐదుగురు యువకులు కొంతమంది యువతులపై అత్యాచారం చేశారు. ఈ ఘటనను వీడియాలుగా తీసి అందరూ షేర్‌ చేసుకోవటమే కాకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురినీ అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో ఐదుగురు నేరం చేసినట్లు నిరూపణ కావడంతో విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ముఠా సభ్యుల్లో ఓ మైనర్‌ బాలుడు ఉండటంతో అతడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement