girls rape case
-
పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘బద్లాపూర్’ రేప్ నిందితుడి మృతి
ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్‌లో సంచలనం సృష్టించిన ‘బద్లాçపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి థానె జిల్లాలోని బద్లాçపూర్ పట్టణానికి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులకు తెగబడిన అతడిని పోలీసులు క్షణాల్లో మట్టుబెట్టారు. సోమవారం సాయంత్రం 6.15గంటలకు ముంబ్రా బైపాస్ రోడ్డు వద్ద ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బద్లాçపూర్లోని ఓ స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల అక్షయ్ అక్కడి నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై లైంగికంగా దాడిచేశాడని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. విషయం తెల్సిన మరుక్షణం స్కూలు పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు, నిరసనకారులు వేలాదిగా ఆందోళన చేపట్టడం తెల్సిందే. ఎదురుకాల్పుల ఉదంతంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విలేకరులతో మాట్లాడారు. ‘‘ అక్షయ్‌పై అతని మాజీ భార్య లైంగిక హింస కేసు పెట్టింది. ఈ కేసులో విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి ఇతడిని బద్లాçపూర్‌కు ఒక పోలీస్ ఎస్కార్ట్ బృందం తీసుకొస్తోంది. మార్గమధ్యంలో పోలీసు వాహనం ముంబ్రా బైపాస్ చేరుకోగానే పోలీస్ నుంచి పిస్టల్‌ను లాక్కొని నిందితుడు ఒక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరెపైకి 2–3 రౌండ్ల కాల్పులు జరిపాడు. హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న మరో పోలీసు అధికారి వెంటనే తన తుపాకీతో అక్షయ్‌ను కాల్చాడు. రక్తమోడుతున్న ఇతడిని దగ్గర్లోని కల్వా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పోలీసు ఇతనిపై కాల్పులు జరిపాడు’’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. -
రాష్ట్రంలో రావణ, దుర్యోధన పాలన
పాట్నా : బిహార్‌లో రావణ-దుర్యోధన పాలన సాగుతోందని ఆర్జేడీ నేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌లోని బాలికల వసతి గృహంలో 34 మంది మైనర్ బాలికలపై అక్కడి సిబ్బంది అత్యాచారాలకు పాల్పడిన ఘటన ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీష్ ప్రభుత్వంపై తేజస్వీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, రావణ-దుర్యోధనుడిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని శనివారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, ఆడ పిల్లలు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారని తేజస్వీ వ్యాఖ్యానించారు. బాలికల వసతి గృహంలో డ్రగ్స్, అబార్షన్ మందులు వంటివి ఉన్నాయిని, దీనికి కారణమైన బ్రిజేష్ కుమార్ అనే వ్యక్తిని ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. ‘బీహార్‌లో రాక్షస పాలన సాగుతోంది.. సీతమ్మను రావణుడు అపహరించాడు.. దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేయించాడు.. బీహార్‌లోనూ రావణ-దుర్యోధన ద్వయం అక్కచెల్లలను, అమ్మలను బయటకు రావడానికి బయపడేలా చేస్తున్నారు. ఇంకా ఎంత మంది బాలికలు వీరి దాష్టికానికి బలికావాలి’ అని విమర్శించారు. ఈ అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఘటనపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐని ఆదేశిస్తూ..సీఎం నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కొద్ది నెలల కిందట చేపట్టిన అధ్యయనంలో ఈ కీచకపర్వం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీహార్ అసెంబ్లీ అట్టుడికింది. దీనికి బాధ్యులైన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. Several drugs & things related to abortion were being used at the shelter home. Still, the main suspect Brajesh Thakur is being protected by govt. When will he be arrested? Till when minor girls will be raped in the state?: Tejashwi Yadav, RJD, on Muzaffarpur shelter home case pic.twitter.com/YNWcJkjK4T — ANI (@ANI) July 28, 2018 -
విజయవాడ కోర్టు సంచలన తీర్పు
-
విజయవాడ కోర్టు సంచలన తీర్పు
విజయవాడ: యువతులకు మత్తుమందు ఇచ్చి.. వారిపై అత్యాచారం జరిపిన కేసులో విజయవాడ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఓ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి శిక్ష ఖరారు చేసింది. ఏ-1 నిందితుడు నిమ్మకూరి సాయిరామ్‌కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీపక్, అభిలాష్, మున్నాలకు 20 ఏళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది. మరో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. విజయవాడలో 2014 సంవత్సరం ఆగస్టు 23న ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన నిమ్మకూరి సాయిరాం, దీపక్, అభిలాష్, అబ్దుల్ ఖాదర్ అలియాస్ మున్నా, దుర్గా ప్రసాద్ అనే ఐదుగురు యువకులు కొంతమంది యువతులపై అత్యాచారం చేశారు. ఈ ఘటనను వీడియాలుగా తీసి అందరూ షేర్ చేసుకోవటమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురినీ అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో ఐదుగురు నేరం చేసినట్లు నిరూపణ కావడంతో విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ముఠా సభ్యుల్లో ఓ మైనర్ బాలుడు ఉండటంతో అతడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు.