'మత్తయ్య కాల్డేటా వివరాలు ఇవ్వండి' | ap cid asks telcos about about call data records of mathaiah | Sakshi
Sakshi News home page

'మత్తయ్య కాల్డేటా వివరాలు ఇవ్వండి'

Published Fri, Jun 26 2015 7:35 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

'మత్తయ్య కాల్డేటా వివరాలు ఇవ్వండి' - Sakshi

'మత్తయ్య కాల్డేటా వివరాలు ఇవ్వండి'

ఓటుకు కోట్లు కేసులో ఎ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య కాల్డేటా వివరాలు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం కోర్టు ద్వారా కోరింది. దాంతో, మత్తయ్య కాల్ డేటా వివరాలను సీఐడీకి ఇవ్వాలని టెలికాం ఆపరేటర్లకు విజయవాడ కోర్టు ఆదేశాలిచ్చింది.

రిలయన్స్, ఎయిర్టెల్, ఐడియా టెలికాం ఆపరేటర్లకు విజయవాడ కోర్టు నుంచి నోటీసులు వెళ్లాయి. విజయవాడ మూడో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు నోటీసులు జారీ చేసింది. మే 1 నుంచి జూన్ 20వ తేదీ వరకు మత్తయ్య కాల్ డేటా వివరాలను సీఐడీ విభాగానికి ఇవ్వాలని ఆయా ఆపరేటర్లను విజయవాడ కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement