
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, విజయవాడ: తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి యూ ట్యూబ్ ఛానల్ లేదని.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మాత్రమే వాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు. ‘‘నా పేరుతో ఎవరో ఫేక్ యూట్యూబ్ ఛానళ్లు నడుపుతున్నారు. వాటి ద్వారా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. తక్షణమే వాటిని తొలగించకపోతే చర్యలు తీసుకుంటా’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు.
అందరికీ నమస్కారం!!
నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు.
నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter మరియు #threads మాత్రమే వాడుతున్నాను,
నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరు. నా పై…— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2024
ఇదీ చదవండి: ‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది