అప్‌లోడ్‌కు సర్వర్ పనిచేయకపోవడంతో నిరీక్షిస్తున్న హెచ్‌ఎంలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో చది విన పదోతరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల నమోదు విషయం గందరగోళంగా మారింది. మార్చి నెలలోపు జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలు పది విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. అయితే ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ తప్పిదాల వల్ల తెలుగు పరీక్ష ఫలితాలు సంస్కృతాని కి, సంస్కృతం ఫలితాలు తెలుగుకు.. ఇలా పలు లాంగ్వేజ్ ఇంటర్నల్ మార్కుల ఫలితాల్లో తప్పిదాలు చోటుచేసుకున్నా యి. ఆవిధంగా జిల్లాలో 32 పాఠశాలలున్నట్లు గుర్తించారు. వారు వెంటనే రికార్డులను తీసుకుని మరోసారి అప్‌లోడ్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అకస్మికంగా ఉత్తర్వులు జారీచేసింది.
దీంతో బుధవారం ఉదయం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డీఈఓ కార్యాలయం వద్దకు రికార్డులతోపరుగులు తీశారు. అయితే సర్వర్ మొరాయించడం, ఫలితాలు అప్‌లోడ్ కాకపోవడం, పరీక్షల విభాగం అధికారుల పర్యవేక్షణ లోపంతో హెచ్‌ఎంలు నిరీక్షిం చాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎంతసేపటికీ సర్వర్ పనిచేయకపోవడంతో పలువురు హెచ్‌ఎంలు వెనుదిరిగారు. 32 పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 550 మంది విద్యార్థుల ఫలితాలు నమోదు కాలేదని సమాచారం. ఇంటర్నల్ మార్కులు నమోదు కాకపోతే తుది ఫలితాల్లో వ్యత్యాసం కనిపించి విద్యార్థులు ఫెయిల్ కావడానికి అవకాశాలుంటాయని హెచ్‌ఎంలు అంటున్నారు. అదే జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నల్ ఫలితాల్లో ఉన్న సమస్యలను సరిదిద్ది నమోదు చేసిన తరువాతే ఫలితాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment