
రోడ్లపై టేలాల తొలగింపు
► రాత్రికి రాత్రే తరలించిన మున్సిపల్ సిబ్బంది
► చిరువ్యాపారుల ఆందోళన
సిరిసిల్ల : సిరిసిల్లలో టేలాల తొలగింపునకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డుపై ఎలాంటి అనుమతి లేకుండా వేసుకున్న టేలాలు, దుకాణా ల ముందు రేకులను శుక్రవారం తొలగించారు.పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఉన్న దుకాణాలను తీసివేశారు. ఇప్పటికే మున్సిపల్ సి బ్బంది ఆయా దుకాణదారులకు టేలా లు తొలగించాలని కోరారు. వారు తొలగించకపోవడంతో రాత్రికి రాత్రే టేలాలను తరలించారు.
కోర్టు ప్రాంతంలో కొన్ని టేలాల్లో కంప్యూటర్లు, జిరాక్స్ మి షన్లు ఉండడంతో వాటిని తొలగించాలని కమిషనర్ సుమన్ రావు కోరారు. టేలాల యజమానులు స్పం దించకుంటే తామే తొలగిస్తామని ఆయన వివరించారు. మున్సిపల్ తీరుపై చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై చిన్న చిన్న వ్యాపారు లు చేసుకుంటే జీవించే తమ పొట్టలు కొడుతున్నారని వ్యాపారులు పేర్కొం టున్నారు. రోడ్డును ఆక్రమిం చిన వారి పై చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా టేలాలను తొలగిస్తున్నామని ఆయన వివరించారు. పట్టణ ప్రజ లు సహకరించాలని కమిషనర్ కోరారు.