భలే గిరాకీ
గోదావరి పుష్కరాలు.. భక్తులకు పుణ్యాన్ని ప్రసాదిస్తుండగా వ్యాపారులకు సిరులు కురిపిస్తున్నాయి. పెద్దసంఖ్యలో వస్తున్న భక్తజనంతో వ్యాపారం వర్ధిల్లుతోంది. తినుబండారాలు, పుస్తకాలు, ఆటవస్తువులు, పూలు తదితరాల విక్రయూలు జోరుగా సాగుతున్నాయి. మొదటి రోజుల్లో గిరాకీ అంతంతమాత్రంగానే ఉన్నా.. చివరి రోజుల్లో వ్యాపారాలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వికసిస్తున్నాయి. దీంతో వ్యాపారులు తమ పెట్టుబడులు తిరిగి వస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయూమని తెలుపుతున్నారు.
-కాళేశ్వరం/ధర్మపురి/బాసర/ కందకుర్తి/భద్రాచలం/మంగపేట నుంచి సాక్షి బృందం
మూడు రోజులుగా
మొదట్లో బాసరలో అంతగా గిరాకీ రాలేదు. ఈ మూడు రోజులుగా కాస్త జనం వస్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న వారు ఇక్కడి నుంచి ఇంటికి పెన్నులు, నోట్ పుస్తకాలను తీసుకెళ్తున్నారు. పుష్కరాల్లో ఆశించిన స్థాయిలో గిరాకీలు రాకున్నా.. ఈ మూడు రోజుల నుంచి వస్తున్నాయి.
-శ్రీనివాస్, చిరువ్యాపారి, బాసర
అంతంత మాత్రమే
పుష్కరాల్లో పండ్ల విక్రయూలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పుష్కరస్నానాలకు వచ్చేవారంతా ఉపవాసదీక్షలతో వస్తున్నారు. వారంతా సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని అక్కడే అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ధరలు పెంచకుండానే విక్రయిస్తున్నాను.
-జమీల్‌హైమద్, చిరువ్యాపారి, బాసర
రోజుకు రూ. 2 నుంచి 3వేల సంపాదన
పుష్కరాల సందర్భంగా తినుబండారాల దుకాణం పెట్టడం కోసం కాళేశ్వరం వచ్చినం. అన్ని రకాల తినుబండారాలను అందుబాటులో ఉంచాం. రోజుకు రెండు నుండి మూడు వేల వరకు గిరాకీ అవుతోంది. దేవుడి దయవల్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతోంది.
- సత్యనారాయణ, వ్యాపారి, సూర్యాపేట
రెండు రోజుల నుంచే గిరాకీ
పుష్కరాలు ప్రారంభమై పదకొండు రోజులు గడుస్తున్నా కాళేశ్వరంలో గిరాకీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మొన్నటి నుంచి మంచిగా గిట్టుబాటు అవుతోంది. మేము పెట్టిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకం ఉంది. కానీ తినుబండరాలు మిగిలిపోయేలా ఉన్నాయి.
- వెంకన్న, నల్లగొండ
ఆశించిన స్థాయిలో లేదు
గోదావరి మహాపుష్కరాల్లో భక్తుల ఆదరణ ఉంటుందని, నాందేడ్ నుంచి కందకుర్తి వచ్చాం. కూలీలకే రోజుకు ఐదు వందల నుంచి ఏడు వందలు చెల్లిస్తున్నాను. గిరాకీ ఆశించిన స్థాయిలో లేదు. సుమారు రూ. 3 లక్షల నష్టం వాటిల్లింది.
-షేక్ మోహిన్, మిఠాయి
వ్యాపారి, నాందేడ్
అప్పులే మిగిలేలా ఉన్నాయి..
కందకుర్తి త్రివేణి సంగమం తీరంలో ఏర్పాటు చేసి తాత్కాలిక బస్టాండ్ వద్ద మిఠాయి దుకాణం పెట్టాను. రూ. 26 వేలు టెండర్‌కు, రూ. 2.50 లక్షలు మిఠాయి తయూరీకి పెట్టాను. ఆశించిన గిరాకీ రాలేదు. పెట్టుబడికి తెచ్చిన అప్పులే మిగిలేలా ఉన్నాయి.
-కిరణ్, మిఠాయి వ్యాపారి, బోధన్
రెండింతలు బిజినెస్
పుష్కర స్నానానికి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలనికి తండోపతండాలుగా తరలి వస్తుండటంతో మా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు సాగుతోంది. మొదటి నాలుగు రోజలు తక్కువగా ఉన్నప్పటికీ చివరి మూడు రోజుల్లో రెండింతల బిజినెస్ నిర్వహించాం.
-బొలిశెట్టి రంగారావు, హోటల్ యజమాని
అధికారులు నిర్ణయించిన ధరకే...
కొంతమంది వ్యాపారుస్తులు భద్రాచలం వద్ద
పుష్కరాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. కానీ మేము అధికారులు నిర్ణరుుంచిన ధరకే విక్రరుుస్తున్నాం. లాభాలను పొందుతున్నాం. పుష్కర సమయంలో సాధారణ ధరలకే వ్యాపారాలను కొనసాగిస్తూ నిజాయితీ చాటుకుంటున్నాం.
- సాయి, టీ కేఫ్ యజమాని
లాభం లేదు... నష్టం లేదు..
మహాపుష్కరాలకు మంగపేటకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారని అంచనా వేశాం. వ్యాపారం బాగానే నడిచినప్పటికీ, వర్షాలు కురవడంతో భక్తులు పుష్కరస్నానం చేసి వెళ్లిపోయూరు. దీంతో మాకు అటు లాభాలు రాలేదు. నష్టాలూ రాలేదు.
-రామశెట్టి శ్రీనివాస్, ఖమ్మం