godhavari pushkaraalu
-
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లా: గోదావరి పుష్కరాలకు వెళుతూ రోడ్డుప్రమాదంలో గాయపడి వైజాక్‌లో చికిత్సపొందుతున్న వ్యక్తి సోమవారం ఉదయం మరణించాడు. వీరఘట్టంకు చెందిన నలుగురు వ్యక్తులు గతనెల17న కారులో పుష్కరాలకు బయలుదేరారు. భోగి చంద్రమౌళి(65) రాజమండ్రి వద్ద కారు ఆపి టిఫెన్ చేసేందుకు రోడ్డుదాటుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి తీవ్రంగా గాయపడ్డాడు. అయనకు రాజమండ్రిలో చికిత్సచేయించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. -
పురోహితుడు లేకుండానే..
వరంగల్(ములుగు) : భక్తుల రద్దీ కారణంగా పురోహితులకు భలే గిరాకీ ఏర్పడింది. వారి కోసం భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. శుక్రవారం వరంగల్ జిల్లా మంగపేట ఘాట్ వద్ద పురోహితుడు దొరకకపోవడంతో తనకు తెలిసిన పద్ధతిలో పితృదేవతలకు పిండప్రదానం చేశాడు. -
భలే గిరాకీ
గోదావరి పుష్కరాలు.. భక్తులకు పుణ్యాన్ని ప్రసాదిస్తుండగా వ్యాపారులకు సిరులు కురిపిస్తున్నాయి. పెద్దసంఖ్యలో వస్తున్న భక్తజనంతో వ్యాపారం వర్ధిల్లుతోంది. తినుబండారాలు, పుస్తకాలు, ఆటవస్తువులు, పూలు తదితరాల విక్రయూలు జోరుగా సాగుతున్నాయి. మొదటి రోజుల్లో గిరాకీ అంతంతమాత్రంగానే ఉన్నా.. చివరి రోజుల్లో వ్యాపారాలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వికసిస్తున్నాయి. దీంతో వ్యాపారులు తమ పెట్టుబడులు తిరిగి వస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయూమని తెలుపుతున్నారు. -కాళేశ్వరం/ధర్మపురి/బాసర/ కందకుర్తి/భద్రాచలం/మంగపేట నుంచి సాక్షి బృందం మూడు రోజులుగా మొదట్లో బాసరలో అంతగా గిరాకీ రాలేదు. ఈ మూడు రోజులుగా కాస్త జనం వస్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న వారు ఇక్కడి నుంచి ఇంటికి పెన్నులు, నోట్ పుస్తకాలను తీసుకెళ్తున్నారు. పుష్కరాల్లో ఆశించిన స్థాయిలో గిరాకీలు రాకున్నా.. ఈ మూడు రోజుల నుంచి వస్తున్నాయి. -శ్రీనివాస్, చిరువ్యాపారి, బాసర అంతంత మాత్రమే పుష్కరాల్లో పండ్ల విక్రయూలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పుష్కరస్నానాలకు వచ్చేవారంతా ఉపవాసదీక్షలతో వస్తున్నారు. వారంతా సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని అక్కడే అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ధరలు పెంచకుండానే విక్రయిస్తున్నాను. -జమీల్హైమద్, చిరువ్యాపారి, బాసర రోజుకు రూ. 2 నుంచి 3వేల సంపాదన పుష్కరాల సందర్భంగా తినుబండారాల దుకాణం పెట్టడం కోసం కాళేశ్వరం వచ్చినం. అన్ని రకాల తినుబండారాలను అందుబాటులో ఉంచాం. రోజుకు రెండు నుండి మూడు వేల వరకు గిరాకీ అవుతోంది. దేవుడి దయవల్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతోంది. - సత్యనారాయణ, వ్యాపారి, సూర్యాపేట రెండు రోజుల నుంచే గిరాకీ పుష్కరాలు ప్రారంభమై పదకొండు రోజులు గడుస్తున్నా కాళేశ్వరంలో గిరాకీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మొన్నటి నుంచి మంచిగా గిట్టుబాటు అవుతోంది. మేము పెట్టిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకం ఉంది. కానీ తినుబండరాలు మిగిలిపోయేలా ఉన్నాయి. - వెంకన్న, నల్లగొండ ఆశించిన స్థాయిలో లేదు గోదావరి మహాపుష్కరాల్లో భక్తుల ఆదరణ ఉంటుందని, నాందేడ్ నుంచి కందకుర్తి వచ్చాం. కూలీలకే రోజుకు ఐదు వందల నుంచి ఏడు వందలు చెల్లిస్తున్నాను. గిరాకీ ఆశించిన స్థాయిలో లేదు. సుమారు రూ. 3 లక్షల నష్టం వాటిల్లింది. -షేక్ మోహిన్, మిఠాయి వ్యాపారి, నాందేడ్ అప్పులే మిగిలేలా ఉన్నాయి.. కందకుర్తి త్రివేణి సంగమం తీరంలో ఏర్పాటు చేసి తాత్కాలిక బస్టాండ్ వద్ద మిఠాయి దుకాణం పెట్టాను. రూ. 26 వేలు టెండర్‌కు, రూ. 2.50 లక్షలు మిఠాయి తయూరీకి పెట్టాను. ఆశించిన గిరాకీ రాలేదు. పెట్టుబడికి తెచ్చిన అప్పులే మిగిలేలా ఉన్నాయి. -కిరణ్, మిఠాయి వ్యాపారి, బోధన్ రెండింతలు బిజినెస్ పుష్కర స్నానానికి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలనికి తండోపతండాలుగా తరలి వస్తుండటంతో మా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు సాగుతోంది. మొదటి నాలుగు రోజలు తక్కువగా ఉన్నప్పటికీ చివరి మూడు రోజుల్లో రెండింతల బిజినెస్ నిర్వహించాం. -బొలిశెట్టి రంగారావు, హోటల్ యజమాని అధికారులు నిర్ణయించిన ధరకే... కొంతమంది వ్యాపారుస్తులు భద్రాచలం వద్ద పుష్కరాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. కానీ మేము అధికారులు నిర్ణరుుంచిన ధరకే విక్రరుుస్తున్నాం. లాభాలను పొందుతున్నాం. పుష్కర సమయంలో సాధారణ ధరలకే వ్యాపారాలను కొనసాగిస్తూ నిజాయితీ చాటుకుంటున్నాం. - సాయి, టీ కేఫ్ యజమాని లాభం లేదు... నష్టం లేదు.. మహాపుష్కరాలకు మంగపేటకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తారని అంచనా వేశాం. వ్యాపారం బాగానే నడిచినప్పటికీ, వర్షాలు కురవడంతో భక్తులు పుష్కరస్నానం చేసి వెళ్లిపోయూరు. దీంతో మాకు అటు లాభాలు రాలేదు. నష్టాలూ రాలేదు. -రామశెట్టి శ్రీనివాస్, ఖమ్మం -
సైకత శిల్పాంజలి
వలంధర్‌ఘాట్/స్టీమర్‌రోడ్డు (నరసాపురం): గోదావరి పుష్కరాల సందర్భంగా కళాకారులు సైకతశిల్పాలను రూపుదిద్ది గోదారమ్మకు కళాంజలి ఘటిస్తున్నారు. నరసాపురంలో ఇసుకరీచ్ వద్ద ఏర్పాటు చేసిన సైకత శిల్పకళా ప్రదర్శనలో కళాకారులు ఇసుకతో తీర్చిదిద్దిన సైకతశిల్పాలు పుష్కరయాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన గేదెల హరికృష్ణ ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు చెందిన సుబల మహరానా..ఇద్దరూ సైకత శిల్పకళలో ఆరితేరి పలు పురస్కారాలు అందుకున్నవారే. డిగ్రీ చదివిన హరికృష్ణ టూరిజం శాఖ ఆహ్వానం మేరకు గోదావరి పుష్కరాలకు నరసాపురం వచ్చి పుష్కర యాత్రికులకు తమ కళానైపుణ్యంతో ధ్యానంలో ఉన్న గౌతమ బుద్ధుడు, విజయవాడ కనకదుర్గ ఆలయ నమూనా, స్వచ్ఛభారత్, గోదావరిపై బ్రిడ్జి నమూనా (రాజమండ్రి) బొమ్మలు తయారు చేశారు. మరో సైకత శిల్పి సుబల మహరానా ఇప్పటి వరకూ 100 అవార్డుల వరకు స్వీకరించిన ఉత్తమ శిల్పి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చిరుద్యోగి. -
పుణ్యస్నానాలు చేసిన ముస్లింలు
నిర్మల్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం గంజాన్ గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం మత సామరస్యాన్ని చాటుకుంది. గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ కుటుంబ సభ్యులు ఆదివారం సోన్ పుష్కర ఘాట్‌లో స్నానం ఆచరించారు. గత పుష్కరాల సమయంలో తమ పెద్దలు స్నానాలు చేశారని, ఈ సారి తాము ఆ విధానాన్ని కొనసాగించామని వారు తెలిపారు. -
ధర్మపురికి 4 లక్షల మంది భక్తులు!
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి పుష్కర ఘాట్ల వద్ద బుధవారం సాయంత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా తాకిడి పెరగటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. -
పాపికొండల సందర్శనకు బ్రేక్!
తూర్పుగోదావరి: గోదావరి పుష్కరాల సమయంలో అందమైన పాపికొండలను సందర్శించే అవకాశం దూరం కానుంది. పుష్కరాల సందర్భంగా పాపికొండల పర్యటనపై నిషేధం విధించి.. ప్రయాణానికి ఉపయోగించే బోట్లను 'ఫ్లోటింగ్ అంబులెన్సులు' గా మార్చనున్నట్టు బుధవారం జలవనరులశాఖ సూపరిండెంట్ ఇంజనీర్ సుగుణాకరరావు వెల్లడించారు. పుష్కరాల సమయంలో బోట్లకు అనుమతివ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 13 వరకూ పాపికొండల పర్యటనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేశారు. గోదావరిలో తిరిగే అన్ని బోట్లను ఘాట్లలో సిద్ధంగా ఉంచేందుకు ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. గోదావరిలో చేపల వేటను కూడా నిషేధించనున్నట్టు వివరించారు. వారు వేటకు ఉపయోగించే నాటు పడవలను ఘాట్లలో రక్షణకు ఉపయోగించనున్నట్టు చెప్పారు. ప్రత్యామ్నాయంగా వారి జీవనోపాధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, నిత్యావసరాలు పంపిణీ చేయనుందని వివరించారు. నాటు పడవల్లో గజ ఈతగాళ్లను నియమించి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. గోదావరి నదిలో నీటిమట్టం తగ్గకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. -
రాజమండ్రికి మరో రెండు విమాన సర్వీసులు
తూర్పుగోదావరి(మధురపూడి): పుష్కరాల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అదనంగా రాజమండ్రికి మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ రెండు సర్వీసులు, స్పైస్జెట్ఒక సర్వీసు నడుపుతున్నాయి. పుష్కరాలనేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు సంస్థలు అదనంగా ఒక్కో సర్వీసును త్వరలో ప్రారంభించనున్నట్టు విమానాశ్రయం డెరైక్టర్ మధుసూదనరావు తెలిపారు.