శ్రీకాకుళం జిల్లా: గోదావరి పుష్కరాలకు వెళుతూ రోడ్డుప్రమాదంలో గాయపడి వైజాక్‌లో చికిత్సపొందుతున్న వ్యక్తి సోమవారం ఉదయం మరణించాడు. వీరఘట్టంకు చెందిన నలుగురు వ్యక్తులు గతనెల17న కారులో పుష్కరాలకు బయలుదేరారు. భోగి చంద్రమౌళి(65) రాజమండ్రి వద్ద కారు ఆపి టిఫెన్ చేసేందుకు రోడ్డుదాటుతుండగా లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో చంద్రమౌళి తీవ్రంగా గాయపడ్డాడు. అయనకు రాజమండ్రిలో చికిత్సచేయించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.