ఏపీలో 5876 మంది చిరు వ్యాపారులకు పెన్షన్ | National Pension Scheme: Pension For 5876 Small Traders In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 5876 మంది చిరు వ్యాపారులకు పెన్షన్

Published Thu, Jul 21 2022 7:37 PM | Last Updated on Thu, Jul 21 2022 7:45 PM

National Pension Scheme: Pension For 5876 Small Traders In AP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పెన్షన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 5876 మంది చిరు వ్యాపారులు మాత్రమే నమోదయ్యారని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిపారు. రాజ్యసభలో గురువారం.. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయం తెలిపారు. 2023-2024 నాటికి  కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 3 కోట్ల మంది వివిధ రకాలైన చిరు వ్యాపారులు, వర్తకులు, స్వయం ఉపాధిపై ఆధారపడే వారిని ఈ పథకంలో చేర్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.
చదవండి: చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి

ఈ పథకం కింద ఈ ఏడాది జూలై 17 వరకు దేశవ్యాప్తంగా కేవలం 50680 మంది మాత్రమే నమోదయ్యారని మంత్రి చెప్పారు. గడిచిన రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి ఈ పథకం అమలుపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక మంది చిన్న వ్యాపారులు, వర్తకులు, వీధి వ్యాపారులు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ ధన్ పథకంలో ఇప్పటికే నమోదయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ఆయా రాష్ట్రాల్లో అర్హులైన లబ్దిదారులు ఈ పథకంలో చేరేలా ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. జాతీయ పెన్షన్ పథకంపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement