Tomato Cost Rs140 Per Kg On Friday In Chintala Manepalle Kumuram Bheem District - Sakshi
Sakshi News home page

కిలో టమాటా రూ.140 

Published Sat, Jul 1 2023 2:08 AM | Last Updated on Sat, Jul 1 2023 10:08 AM

Tomato cost Rs140 per kg on Friday - Sakshi

చింతలమానెపల్లి: కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌ వారసంతలో శుక్రవారం టమాటా కిలో రూ.140 పలికింది. జూన్‌ నెల ఆరంభంలో రూ.60 కిలో చొప్పున విక్రయించగా..ఆ తర్వాత రూ.80 నుంచి రూ.100కు చేరింది. టమాటా రూ.140కు చేరడం ఇదే మొదటిసారని వ్యాపారులు తెలిపారు.

టమాటాను ఏపీలోని గుంటూరు, మదనపల్లె, కర్ణాటకలోని కోలార్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, లాతూర్, నాసిక్‌ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు పేర్కొన్నారు. టోకు వ్యాపారుల నుంచి 22 కిలోల టమాటాల పెట్టె రూ.2,400 ధర పలుకుతోందని, దీంతో తాము కిలో రూ.140 చొప్పున విక్రయించాల్సి వస్తోందని చిరు వ్యాపారులు వెల్లడించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement