
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా తిరువూరులో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల ప్రాంగణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుమారి (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.
సెంకండియర్ విద్యార్థి వెంకటేశ్వరరావు ఆమెను నిత్యం వేధించేవాడని, అతని వేధింపులు తాళలేకనే కుమారి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. సీనియర్ వేధింపుల గురించి పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment