సాక్షి, దోమకొండ(నిజామాబాద్) : తల్లితండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమకొండ మండలకేంద్రంలో చొటుచేసుకుంది. ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ గ్రామానికి చెందిన కుకుట్ల మౌనిక(16) కామారెడ్డిలోని సాందీపని జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈక్రమంలో గత వారంరోజుల నుంచి తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లితండ్రులను కోరింది. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత కొనిస్తామని కూతురుకు వారు తెలిపారు. ఈ విషయంలో తీవ్ర మనస్థాపం చెందిన మౌనిక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగింది.
తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆమెను కామారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుప్రతికి తీసుకువెళ్లారు. ఈక్రమంలో మౌనిక మంగళవారం చికిత్స పొందుతూ వేకువజామున మృతిచెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
నిజామాబాద్ నగరంలో..
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఆరోటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోగల డైరీఫాంలో మంగళవారం ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గౌరేందర్‌గౌడు తెలిపారు. నగరానికి చెందిన అబ్దుల్‌జావీద్ ఆర్థిక ఇబ్బందుల వల్లే తన ఇంటిలో మంగళవారం ఎవరు లేని సమయంల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య యాస్మిన్‌బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుక్నుట్లు ఎస్సై తెలిపారు.
సిరికొండలో యువకుడి ఆత్మహత్యాయత్నం
సిరికొండ: మండలకేంద్రంలోని ఎల్లం చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన స్థానిక వీఆర్‌ఏ చిన్న సాయిలు చెరువులో దూకి అతడిని కాపాడాడు. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం బండరామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్(25) తన అత్తగారి ఊరైన రావుట్లకు వచ్చాడు. కుటుంబ కలహలతో తిరుగు ప్రయాణంలో మంగళవారం మధ్యాహ్నం సిరికొండలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. అది చూసిన వీఆర్‌ఎ చెరువులో దూకి అతడిని ఒడ్డుకు తీసుకువచ్చాడు. సమాచారం తెలిసిన కానిస్టేబుల్ రాకేష్ చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు కానిస్టేబుల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment