వనస్థలిపురంలోని శ్రీమేథ కాలేజీ ఇంటర్ విద్యార్థి భవానిసాయి గత అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భవాని సాయి తరగతి గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు కాలేజి యాజమాన్యానికి సమాచారం అందించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కళాశాలకు చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు.
భవాని సాయి మరణవార్తను అతడి తల్లితండ్రులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద లభించిన లేఖను పోలీసులు పరిశీలిస్తున్నారు. భవాని సాయి మరణానికి గల కారణాలపై పోలీసులు అతని స్నేహితులను విచారిస్తున్నారు. అయితే కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే సాయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.