రాజేశ్వరిని కొడుకుకు అప్పగిస్తున్న పోలీసులు
15 నిమిషాల్లో గుర్తించిన కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు
కరీంనగర్‌క్రైం: ఇంట్లో కొడుకుతో గొడవపడిన ఓ మహిళ బయటకు వెళ్లిపోయింది. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు 15 నిమిషాల్లో ఆమె ఆచూకీ కనిపెట్టారు. వారి వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని కిషన్‌రావుపల్లికి చెందిన రాజేశ్వరి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. కుమారుడు నితిన్ ఆమె వద్దే ఉంటున్నాడు. అయితే, సోమవారం కొడుకుతో గొడవపడిన రాజేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్లి, కరీంనగర్ బస్టాండ్‌కు చేరుకుంది.
నితిన్ ఫోన్ చేస్తే తాను కరీంనగర్ వచ్చానని, డ్యాంలో దూకి చనిపోతానని చెప్పింది. అతను వెంటనే 100కు ఫోన్ చేసి, వివరాలు తెలిపాడు. రాజేశ్వరి ఫొటోల ఆధారంగా వన్ టౌన్ బ్లూకోల్ట్స్ సిబ్బంది సర్వర్ అలీ, భాస్కర్ కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఆమెను గుర్తించారు. అనంతరం బాధితురాలి కుమారుడిని పిలిపించి, కౌన్సెలింగ్ చేసి, పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment